Paralokamu Nundi Digivachchina Jeevahaaramu Kreestu Lyrics in Telugu & English
Verse 1
పరలోకము నుండి దిగివచ్చిన జీవహారము క్రీస్తు (2)
రండి రారండి స్వీకరించండి
నాకై నీకై అప్పమై మారిన క్రీస్తుని భుజించరారండి (2)
Paralokamu Nundi Digivachchina Jeevahaaramu Kreestu (2)
Randi Raarandi Sveekarinchandi
Naakai Neekai Appamai Maarina Kreestuni Bhujincharaarandi (2)
Verse 2
నా శరీరము నిజమైన ఆహారము
నా రక్తము నిజమైన పానము
శరీరము భుజించి రక్తము పానము
చేసిన వారు నాయందును వారిలో నేను ఉందును
Naa Shareeramu Nijamaina Aahaaramu
Naa Raktamu Nijamaina Paanamu
Shareeramu Bhujinchi Raktamu Paanamu
Chesina Vaaru Naayandunu Vaarilo Nenu Undunu
Verse 3
తండ్రి దేవుడు ప్రసాదించిన నిజమైన పరలోక ఆహారము
ఎన్నటికీని ఆకలిగొనని నిత్యజీవపు ఆహారము (2)
నిత్యజీవమిచ్చు శాశ్వత భోజనం భుజించుటకై రారండి (2)
||నా శరీరము||
Tandri Devudu Prasaadinchina Nijamaina Paraloka Aahaaramu
Ennatikeeni Aakaligonani Nityajeevapu Aahaaramu (2)
Nityajeevamichchu Shaashvata Bhojanam Bhujinchutakai Raarandi (2)
||Naa Shareeramu||
Verse 4
మన్నాను భుజించియు మరణించినారు
పితరులు ఎల్లరు ఎడారిలో మన్నాకన్నా మిన్నదైన జీవాహారము నేనే (2)
నన్ను భుజించువారు మరణింపరు కానీ నిరంతరం జీవించును (2)
||నా శరీరము||
Mannaanu Bhujinchiyu Maraninchinaaru
Pitarulu Ellaru Edaarilo Mannaakannaa Minnadaina Jeevaahaaramu Nene (2)
Nannu Bhujinchuvaaru Maranimparu Kaanee Nirantaram Jeevinchunu (2)
||Naa Shareeramu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.