Stutinchedanu Stutinchedanu Naa Yesu Prabhun Lyrics in Telugu & English
Chorus
స్తుతించెదను స్తుతించెదను
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము
||స్తుతించెదను||
Stutinchedanu Stutinchedanu
Naa Yesu Prabhun Krutajnyatato Anudinamu
||Stutinchedanu||
Verse 1
ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక (2)
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని (2)
ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను (2)
||స్తుతించెదను||
Unnata Devudu Sarvaadhipatiyu – Urvi Paripaalaka (2)
Unnatam Visarjinchi Nannu Vedakina – Uttama Snehituni (2)
Udayam Sandhyaa Ellappudunu – Utsaaha Dhvanito Paadedanu (2)
||Stutinchedanu||
Verse 2
నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి (2)
నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప (2)
నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి (2)
||స్తుతించెదను||
Naashanakaramaina Paapa Gunta Nundi – Naraka Vedana Nundi (2)
Nannu Vidipinchi Nilipina Devaa – Nirmala Svaroopa (2)
Neeti Samaadhaanam Santoshamuto – Nitya Jeevamu Naakichchitivi (2)
||Stutinchedanu||
Verse 3
పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి (2)
పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన (2)
పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా (2)
||స్తుతించెదను||
Paapamu Kshaminchi Rogamu Baapi – Bhayamunu Deerchi (2)
Pavitradaayaka Paavana Moorti – Parishuddha Michchina (2)
Parama Paadam Sharanyam Naaku – Parama Raajaa Punya Devaa (2)
||Stutinchedanu||
Verse 4
తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును (2)
దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా (2)
దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి (2)
||స్తుతించెదను||
Talli Garbhamunaku Munderparachi – Dehamu Namarchiyunu (2)
Dakshina Baahuto Pattukonina – Dayaa Sampoornudaa (2)
Dikku Jayamu Aadaranayu – Dayato Anugrahinchitivi (2)
||Stutinchedanu||
Verse 5
సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన (2)
స్నేహ దర్శక వీర యోధ – సంశయ హారకా (2)
శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా (2)
||స్తుతించెదను||
Siluvanetti Shramalu Sahinchi – Sevaku Pilachina (2)
Sneha Darshaka Veera Yodha – Sanshaya Haarakaa (2)
Shramalu Ninda Aakaliyaina – Nee Snehamunundi Edabaapunaa (2)
||Stutinchedanu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.