1 Chronicles · chapter 16 · verse 2
1 Chronicles 16:2 in Telugu
దహనబలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి
Dahanabalulanu samaadhaana balulanu daaveedu arpinchi chaalinchina taruvaata atadu yehovaa naamamuna janulanu deevinchi
1 Chronicles 16:2 in English
- King James Version (KJV)
- And when David had made an end of offering the burnt offerings and the peace offerings, he blessed the people in the name of the LORD.
- World English Bible (WEB)
- When David had finished offering the burnt offering and the peace offerings, he blessed the people in the LORD’s name.
- American Standard Version (ASV)
- And when David had made an end of offering the burnt-offering and the peace-offerings, he blessed the people in the name of Jehovah.
- Bible in Basic English (BBE)
- And when David had come to an end of making the burned offerings and peace-offerings, he gave the people a blessing in the name of the Lord.
- Darby Translation (DBY)
- And when David had ended offering up the burnt-offerings and the peace-offerings, he blessed the people in the name of Jehovah.
- Webster's Bible (WBS)
- And when David had made an end of offering the burnt-offerings and the peace-offerings, he blessed the people in the name of the LORD.
- Young's Literal Translation (YLT)
- and David ceaseth from offering the burnt-offering and the peace-offerings, and blesseth the people in the name of Jehovah,
Read in context
- 1ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసికొని వచ్చి, దావీదు దానికొరకు వేయించియున్న గుడారము నడుమను దాని ఉంచి, దేవుని సన్నిధిని దహనబలులను సమాధానబలులను అర్పించిరి.
- 2దహనబలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి
- 3పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్షపండ్ల అడను పంచి పెట్టెను.
- 4మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును ఆయ నకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను.
Cross references
- Genesis 47:10 ఆదికాండము 47:10ఫరోను దీవించి ఫరో యెదుటనుండి వెళ్లిపోయెను.
- 2 Chronicles 30:18–20 2 దినవృత్తాంతములు 30:18–20ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను దేశములనుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించు కొనకయే విధివిరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధస్థలముయొక్క శుద్ధీకరణముచొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను.
- 2 Chronicles 30:27 2 దినవృత్తాంతములు 30:27అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారిమాటలు వినబడెను; వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను.
- Joshua 22:6 యెహోషువ 22:6అతడీలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్లనంపగా వారు తమ నివాస ములకు పోయిరి.
- Leviticus 1:3 లేవీయకాండము 1:3అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగ దానిని తీసికొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వార మునకు దానిని తీసికొని రావలెను.
- Numbers 6:23–27 సంఖ్యాకాండము 6:23–27మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక; యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక; యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయులమీద నా నామ మును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను.
- Genesis 20:7 ఆదికాండము 20:7కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకుదువు. నీవు ఆమెను అతని కప్పగించని యెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను.
- 1 Kings 8:55–56 1 రాజులు 8:55–56అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజమంతటిని దీవించెను. ఎట్లనగాతాను చేసిన వాగ్దానమంతటినిబట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషేద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పి పోయినదికాదు
- 2 Samuel 6:18 2 సమూయేలు 6:18దహనబలులను సమాధానబలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి,
- Hebrews 7:7 హెబ్రీయులకు 7:7తక్కువవాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై యున్నది.
- 2 Chronicles 29:29 2 దినవృత్తాంతములు 29:29వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితోకూడనున్న వారందరును తమ తలలు వంచి ఆరాధించిరి.
- Genesis 47:7 ఆదికాండము 47:7మరియు యోసేపు తన తండ్రియైన యాకోబును లోపలికి తీసికొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను.