1 Chronicles · chapter 19 · verse 14
1 Chronicles 19:14 in Telugu
ఆ ప్రకారము యోవాబును అతనితో కూడ నున్న జనమును సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలువ లేక అతని యెదుటనుండి తిరిగి పారిపోయిరి.
Aa prakaaramu yovaabunu atanito kooda nunna janamunu siriyanulato yuddhamu kaluputakai cherapogaa vaaru niluva leka atani yedutanundi tirigi paaripoyiri.
1 Chronicles 19:14 in English
- King James Version (KJV)
- So Joab and the people that [were] with him drew nigh before the Syrians unto the battle; and they fled before him.
- World English Bible (WEB)
- So Joab and the people who were with him came near to the front of the Syrians to the battle; and they fled before him.
- American Standard Version (ASV)
- So Joab and the people that were with him drew nigh before the Syrians unto the battle; and they fled before him.
- Bible in Basic English (BBE)
- So Joab and the people who were with him went forward into the fight against the Aramaeans, and they went in flight before him.
- Darby Translation (DBY)
- And Joab and the people that were with him drew near in front of the Syrians to the battle; and they fled before him.
- Webster's Bible (WBS)
- So Joab and the people that [were] with him drew nigh before the Syrians to the battle; and they fled before him.
- Young's Literal Translation (YLT)
- And Joab draweth nigh, and the people who [are] with him, before Aram to battle, and they flee from his face;
Read in context
- 12సిరియనుల బలమునకు నేను నిలువ లేకపోయినయెడల నీవు నాకు సహాయము చేయవలెను, అమ్మోనీయుల బలమునకు నీవు నిలువలేకపోయినయెడల నేను నీకు సహాయము చేయుదును.
- 13ధైర్యము కలిగియుండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము; యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక.
- 14ఆ ప్రకారము యోవాబును అతనితో కూడ నున్న జనమును సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలువ లేక అతని యెదుటనుండి తిరిగి పారిపోయిరి.
- 15సిరియనులు తిరిగి పారిపోవుట అమ్మోనీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అబీషైముందర నిలువలేక తిరిగి పారిపోయి పట్టణములో చొచ్చిరి, యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చెను.
- 16తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని సిరియనులు తెలిసికొనినప్పుడు వారు దూతలను పంపి, యేటి ఆవలి సిరియనులను పిలిపించుకొనిరి, హదరెజెరుయొక్క సైన్యాధిపతియైన షోపకు వారికి నాయకుడాయెను.
Cross references
- 1 Kings 20:28–30 1 రాజులు 20:28–30అప్పుడు దైవజనుడైన యొకడు వచ్చి ఇశ్రా యేలు రాజుతో ఇట్లనెనుయెహోవా సెలవిచ్చున దేమనగాసిరియనులు యెహోవాకొండలకు దేవుడేగాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు; అయితే నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించెదను. వారు ఎదురుముఖములుగా ఏడుదినములు గుడారములు వేసికొని యుండిన తరువాత ఏడవ దినమందు యుద్ధమునకు కలిసికొనగా ఇశ్రాయేలువారు ఒక దినమందే సిరియనుల కాల్బలము లక్షమందిని హతము చేసిరి. తక్కినవారు ఆఫెకు పట్టణములోనికి పారిపోగా అచ్చటనున్న యొకప్రాకారము శేషించినవారిలో ఇరువది యేడు వేలమంది మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆ యాగదులలో చొరగా
- 1 Kings 20:19–21 1 రాజులు 20:19–21రాజ్యాధిపతులలోనున్న ఆ ¸యౌవనులును వారితో కూడనున్న దండువారును పట్టణములోనుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇశ్రాయేలువారు వారిని తరుము చుండగా సిరియా రాజైన బెన్హదదు గుఱ్ఱమెక్కి రౌతులతో గూడ తప్పించుకొని పోయెను. అంతట ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుఱ్ఱములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను.
- 2 Chronicles 13:5–16 2 దినవృత్తాంతములు 13:5–16ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడును ఏలునట్లుగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతివారితోను భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలిసికొందురు గదా. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడునగు యరొబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానునిమీద తిరుగుబాటు చేసెను. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్యదశలోనుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తిలేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి. ఇప్పుడు దావీదు సంతతి వారి వశముననున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధముచేయ తెగించెదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు; యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలును మీయొద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతివారైన యెహోవా యాజకులను, లేవీయులను త్రోసివేసి, అన్యదేశముల జనులు చేయునట్లు మీకొరకు యాజకులను నియమించు కొంటిరిగదా? ఒక కోడెతోను ఏడు గొఱ్ఱె పొట్టేళ్లతోను తన్ను ప్రతిష్ఠించుటకైవచ్చు ప్రతివాడు, దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడైయున్నాడు; మేము ఆయనను విసర్జించిన వారము కాము; అహరోను సంతతివారు యెహోవాకు సేవచేయు యాజకులై యున్నారు; లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు. వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహనబలులు అర్పించుచు, సుగంధద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్లమీద సన్నిధిరొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు; మేము మా దేవుడైన యెహోవా యేర్పరచిన విధినిబట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు, మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు; ఇశ్రాయేలువారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధముచేయకుడి, చేసినను మీరు జయమొందరు. యరొబాము వారి వెనుకటి భాగమందు మాటు గాండ్రను కొందరిని ఉంచి, సైన్యము యూదావారికి ముందును మాటుగాండ్ర వారికి వెనుకను ఉండునట్లు చేసెను. యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలిసికొని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులును బూరలు ఊదిరి. అప్పుడు యూదావారు ఆర్భటించిరి; యూదావారు ఆర్భటించి నప్పుడు యరొబామును ఇశ్రాయేలువారందరును అబీయా యెదుటను యూదావారి యెదుటను నిలువలేకుండునట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలువారు యూదా వారి యెదుటనుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదా వారిచేతికి అప్పగించినందున
- Jeremiah 46:15–16 యిర్మీయా 46:15–16నీలో బలవంతులైన వారేల తుడుపు పెట్టబడు చున్నారు? యెహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు. ఆయన అనేకులను తొట్రిల్ల జేయుచున్నాడు వారొకనిమీద ఒకడు కూలుచు లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము రండి మన స్వజనులయొద్దకు మన జన్మభూమికి వెళ్లుదము రండి అని వారు చెప్పుకొందురు.
- 1 Kings 20:13 1 రాజులు 20:13ప్రవక్తయైన యొకడు ఇశ్రాయేలు రాజైన అహాబునొద్దకు వచ్చి అతనితో ఇట్లనెనుయెహోవా సెలవిచ్చునదేమనగాఈ గొప్ప దండంతయు నీవు చూచితివే; నేను యెహోవానని నీవు గ్రహించునట్లు నేడు దానిని నీచేతి కప్పగించెదను.