1 Chronicles · chapter 2 · verse 13
1 Chronicles 2:13 in Telugu
యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను
Yeshshayi tana jyeshtha kumaarudaina eleeyaabunu rendavavaadaina abeenaadaabunu moodavavaadaina shammaanu
1 Chronicles 2:13 in English
- King James Version (KJV)
- And Jesse begat his firstborn Eliab, and Abinadab the second, and Shimma the third,
- World English Bible (WEB)
- and Jesse became the father of his firstborn Eliab, Abinadab the second, Shimea the third,
- American Standard Version (ASV)
- and Jesse begat his first-born Eliab, and Abinadab the second, and Shimea the third,
- Bible in Basic English (BBE)
- And Jesse was the father of Eliab, his oldest son, and Abinadab, the second, and Shimea, the third,
- Darby Translation (DBY)
- and Jesse begot his firstborn Eliab, and Abinadab the second, and Shimea the third,
- Webster's Bible (WBS)
- And Jesse begat his first-born Eliab, and Abinadab the second, and Shimma the third,
- Young's Literal Translation (YLT)
- and Jesse begat his first-born Eliab, and Abinadab the second, and Shimea the third,
Read in context
- 11నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను,
- 12బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,
- 13యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను
- 14నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని
- 15ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.
Cross references
- 1 Samuel 17:13 1 సమూయేలు 17:13అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమా రుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా,
- 1 Samuel 17:28 1 సమూయేలు 17:28అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్న యగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితోనీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను.
- 1 Samuel 16:6–13 1 సమూయేలు 16:6–13వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచినిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచి యున్నాడని అనుకొనెను అయితే యెహోవా సమూ యేలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడుయెహోవా ఇతని కోరుకొన లేదనెను. అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడుయెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలుయెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడుఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలునీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను. అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను. అతడు రాగానేనేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూ యేలు లేచి రామాకు వెళ్లిపోయెను.
- 1 Chronicles 20:7 1 దినవృత్తాంతములు 20:7వాడు ఇశ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను.
- 1 Chronicles 27:18 1 దినవృత్తాంతములు 27:18దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను, మిఖాయేలు కుమారు డైన ఒమీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను,