1 Chronicles · chapter 21 · verse 7
1 Chronicles 21:7 in Telugu
ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుటచేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను.
Ee kaaryamu devuni drushtiki pratikoolamagutacheta aayana ishraayeleeyulanu baadhapettenu.
1 Chronicles 21:7 in English
- King James Version (KJV)
- And God was displeased with this thing; therefore he smote Israel.
- World English Bible (WEB)
- God was displeased with this thing; therefore he struck Israel.
- American Standard Version (ASV)
- And God was displeased with this thing; therefore he smote Israel.
- Bible in Basic English (BBE)
- And God was not pleased with this thing; so he sent punishment on Israel.
- Darby Translation (DBY)
- And God was displeased on account of this thing, and he smote Israel.
- Webster's Bible (WBS)
- And God was displeased with this thing, therefore he smote Israel.
- Young's Literal Translation (YLT)
- And it is evil in the eyes of God concerning this thing, and He smiteth Israel,
Read in context
- 5ఇశ్రాయేలీయులందరిలో కత్తి దూయువారు పదకొండు లక్షల మందియు యూదా వారిలో కత్తి దూయువారు నాలుగు లక్షల డెబ్బదివేల మందియు సంఖ్యకు వచ్చిరి.
- 6రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు.
- 7ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుటచేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను.
- 8దావీదునేను ఈ కార్యముచేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొఱ్ఱపెట్టగా
- 9యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఈలాగు సెలవిచ్చెనునీవు వెళ్లి దావీ దుతో ఇట్లనుము.
Cross references
- 1 Chronicles 21:14 1 దినవృత్తాంతములు 21:14కావున యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో డెబ్బదివేలమంది చచ్చిరి.
- 2 Samuel 21:1 2 సమూయేలు 21:1దావీదు కాలమున మూడు సంవత్సరములు విడువ కుండ కరవుకలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెల విచ్చెనుసౌలు గిబియోనీయులను హతముచేసెను గనుక అతనిని బట్టియు, నరహంతకులగు అతని యింటివారినిబట్టియు శిక్షగా ఈ కరవు కలిగెను.
- 1 Kings 15:5 1 రాజులు 15:5దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును, యెరూష లేమును స్థిరపరచుటకును, అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండ నిచ్చెను.
- Joshua 7:1 యెహోషువ 7:1శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటుచేసిరి. ఎట్లనగా యూదాగోత్రములో జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమా రుడునైన ఆకాను శపితము చేయబడినదానిలో కొంత తీసికొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయులమీద కోపించెను.
- Joshua 7:5 యెహోషువ 7:5అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరు గురు మనుష్యులను హతము చేసిరి. మరియు తమగవినియొద్ద నుండి షేబారీమువరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను.
- 2 Samuel 24:1 2 సమూయేలు 24:1ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీ యులమీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసినీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.
- 2 Samuel 11:27 2 సమూయేలు 11:27అంగ లార్పుకాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య యయి అతనికొక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.
- 2 Samuel 21:14 2 సమూయేలు 21:14సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధియందు పాతిపెట్టిరి. రాజు ఈలాగు చేసిన తరువాత దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవు డంగీకరించెను.
- Joshua 7:13 యెహోషువ 7:13నీవు లేచి జనులను పరిశుద్ధపఱచి వారితో ఈలాగు చెప్పుమురేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగాఇశ్రాయేలీయు లారా, మీ మధ్య శాపగ్రస్తమైన దొకటి కలదు; మీరు దానిని మీ మధ్య నుండకుండ నిర్మూ లము చేయువరకు మీ శత్రువుల యెదుట మీరు నిలువలేరు.
- Joshua 22:16–26 యెహోషువ 22:16–26యెహోవా సర్వ సమాజపువారు చెప్పుచున్నదేమనగానేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని, ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరేల తిరుగుబాటు చేయు చున్నారు? పెయోరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజ ములో తెగులు పుట్టెను గదా నేటివరకు మనము దానినుండి పవిత్రపరచుకొనకయున్నాము. మీరు ఈ దిన మున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగ బడి ద్రోహము చేసెదరేమి? ఆలాగైతె ఆయన ఇకమీదట ఇశ్రాయేలీయుల సర్వసమా జముమీద కోపపడును గదా? మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్ర ముగా నుండినయెడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసికొనుడి, మన దేవుడైన యెహోవా బలి పీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరుగబడకుడి, మా మీద తిరుగబడకుడి, జెరహు కుమారుడైన ఆకాను ప్రతి ష్ఠితమైన దానివిషయములో తిరుగబడినప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మీదికి కోపము రాలేదా? తన దోషమువలన ఆ మనుష్యుడొకడే మరణ మాయెనా? అందుకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపువారును ఇశ్రాయేలీయుల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు; సంగతి ఆయనకు తెలి యును, ఇశ్రాయేలీయులు తెలిసి కొందురు, ద్రోహము చేతనైనను యెహోవామీద తిరుగు బాటుచేతనైనను మేము ఈ పని చేసినయెడల నేడు మమ్ము బ్రదుకనియ్యకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి, దహనబలినైనను నైవేద్య మునైనను దానిమీద అర్పించుటకే గాని సమా ధాన బలులను దానిమీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టినయెడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువుచేతనే ఈ బలిపీఠమును కట్టితివిు. ఏమనగా రాబోవుకాలమున మీ సంతానపు వారు మా సంతానపువారితోఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీయులారా గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెను గదా యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుటవలన మీ సంతా నపువారు మా సంతానపువా రిని యెహోవా విషయములో భయభక్తులులేని వార గునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీని చేసితివిు. కాబట్టి మేముమనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పు కొంటిమి; అది దహనబలుల నర్పించుటకైనను బలి నర్పిం చుటకైనను కాదు.