1 Chronicles · chapter 4 · verse 15
1 Chronicles 4:15 in Telugu
యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరూ ఏలా నయము; ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను.
Yephunne kumaarudaina kaalebu kumaarulu eeroo elaa nayamu; elaa kumaarulalo kanaju anu okadundenu.
1 Chronicles 4:15 in English
- King James Version (KJV)
- And the sons of Caleb the son of Jephunneh; Iru, Elah, and Naam: and the sons of Elah, even Kenaz.
- World English Bible (WEB)
- The sons of Caleb the son of Jephunneh: Iru, Elah, and Naam. The son of Elah: Kenaz.
- American Standard Version (ASV)
- And the sons of Caleb the son of Jephunneh: Iru, Elah, and Naam; and the sons of Elah; and Kenaz.
- Bible in Basic English (BBE)
- And the sons of Caleb, the son of Jephunneh: Iru, Elah, and Naam; and the son of Elah: Kenaz.
- Darby Translation (DBY)
- — And the sons of Caleb the son of Jephunneh: Iru, Elah, and Naam; and the sons of Elah, ...and Kenaz.
- Webster's Bible (WBS)
- And the sons of Caleb the son of Jephunneh; Iru, Elah, and Naam: and the sons of Elah, even Kenaz.
- Young's Literal Translation (YLT)
- And sons of Caleb son of Jephunneh: Iru, Elah, and Naam; and sons of Elah, even Kenaz.
Read in context
- 13కనజు కుమారులు ఒత్నీయేలు శెరాయా; ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒక డుండెను.
- 14మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవా బును కనెను, ఆ లోయలోనివారు పనివారై యుండిరి.
- 15యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరూ ఏలా నయము; ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను.
- 16యెహల్లెలేలు కుమారులు జీఫు జీఫా తీర్యా అశర్యేలు.
- 17ఎజ్రా కుమారులు యెతెరు మెరెదు ఏఫెరు యాలోను; మెరెదు భార్య మిర్యామును షమ్మయిని ఎష్టెమోను వారికి పెద్దయయిన ఇష్బాహును కనెను.
Cross references
- Numbers 13:6 సంఖ్యాకాండము 13:6యూదా గోత్రమునకు యెఫున్నె కుమారు డైన కాలేబు;
- Numbers 13:30 సంఖ్యాకాండము 13:30కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.
- Numbers 14:30 సంఖ్యాకాండము 14:30యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణముచేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు; ఇది నిశ్చయము.
- Numbers 14:24 సంఖ్యాకాండము 14:24నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను.
- Numbers 14:6–10 సంఖ్యాకాండము 14:6–10అప్పుడు దేశమును సంచరించి చూచినవారిలోనుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతోమేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనం దించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును;. అది పాలు తేనెలు ప్రవహించుదేశము. మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదనుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై యున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రా యేలీయుల కందరికి కనబడెను.
- Joshua 15:13–20 యెహోషువ 15:13–20యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త యైన అర్బాయొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను. అక్కడనుండి కాలేబు అనాకుయొక్క ముగ్గురు కుమారు లైన షెషయి అహీమాను తల్మయి అను అనాకీయుల వంశీ యులను వెళ్లగొట్టి వారిదేశమును స్వాధీనపరచుకొనెను. అక్కడనుండి అతడు దెబీరు నివాసులమీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్సేఫెరు. కాలేబుకిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెదనని చెప్పగా కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీ యేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను. మరియు ఆమె తన పెనిమిటి యింటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచినీకేమి కావలెనని ఆమె నడిగెను. అందుకామెనాకు దీవెన దయచేయుము; నీవు నాకు దక్షిణభూమి యిచ్చి యున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది.
- Joshua 14:6–14 యెహోషువ 14:6–14యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవిచేసెనుకాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్నుగూర్చియు చెప్పినమాట నీ వెరుగుదువు. దేశ మును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలోనుండి నన్ను పంపినప్పుడు నేను నలువది ఏండ్లవాడను; ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. నాతోకూడ బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయము లను కరుగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసినీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పు డును స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పి నట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడచిన యీ నలు వది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి యున్నాడు; ఇదిగో నేనిప్పుడు ఎనబదియయిదేండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటివరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచునుండుటకు గాని నాకెప్పటియట్లు బల మున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన యీ కొండ ప్రదేశమును నాకు దయచేయుము; అనాకీ యులును ప్రాకారముగల గొప్ప పట్టణములును అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైయుండిన యెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహో వాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహో షువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీ యుని కుమారుడైన కాలేబునకు నేటివరకు స్వాస్థ్యముగా నున్నది.
- Judges 1:12–14 న్యాయాధిపతులు 1:12–14కాలేబుకిర్యత్సేఫెరును పట్టుకొని కొల్ల బెట్టువానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెద నని చెప్పగా కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె యైన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. ఆమె తన పెనిమిటి యింట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబునీకేమి కావలెనని యడిగెను