1 Corinthians · chapter 12 · verse 18
1 Corinthians 12:18 in Telugu
అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను.
Ayite devudu avayavamulalo pratidaanini tana chittaprakaaramu shareeramulo nunchenu.
1 Corinthians 12:18 in English
- King James Version (KJV)
- But now hath God set the members every one of them in the body, as it hath pleased him.
- World English Bible (WEB)
- But now God has set the members, each one of them, in the body, just as he desired.
- American Standard Version (ASV)
- But now hath God set the members each one of them in the body, even as it pleased him.
- Bible in Basic English (BBE)
- But now God has put every one of the parts in the body as it was pleasing to him.
- Darby Translation (DBY)
- But now God has set the members, each one of them in the body, according as it has pleased [him].
- Webster's Bible (WBS)
- But now hath God set the members every one of them in the body, as it hath pleased him.
- Young's Literal Translation (YLT)
- and now, God did set the members each one of them in the body, according as He willed,
Read in context
- 16మరియునేను కన్ను కాను గనుక శరీరము లోనిదానను కానని చెవి చెప్పినంత మాత్ర మున శరీరములోనిది కాకపోలేదు.
- 17శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ?
- 18అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను.
- 19అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?
- 20అవయవములు అనేకములైనను శరీర మొక్కటే.
Cross references
- 1 Corinthians 12:28 1 కొరింథీయులకు 12:28మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.
- Romans 12:3 రోమీయులకు 12:3తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.
- 1 Corinthians 12:11 1 కొరింథీయులకు 12:11అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.
- Luke 12:32 లూకా 12:32చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది
- 1 Corinthians 3:5 1 కొరింథీయులకు 3:5అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొ క్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి
- 1 Corinthians 12:24 1 కొరింథీయులకు 12:24సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు.
- Psalm 135:6 కీర్తనలు 135:6ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు
- Luke 10:21 లూకా 10:21ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి - తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించు చున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూల మాయెను.
- Isaiah 46:10 యెషయా 46:10నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.
- Jonah 1:14 యోనా 1:14కాబట్టి వారు యెహోవా, నీ చిత్తప్రకారముగా నీవే దీని చేసితివి; ఈ మనుష్యునిబట్టి మమ్మును లయము చేయకుందువు గాక; నిర్దోషిని చంపితిరన్న నేరము మామీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసికొని
- 1 Corinthians 15:38 1 కొరింథీయులకు 15:38అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు.
- Revelation 4:11 ప్రకటన 4:11ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి.