1 Corinthians · chapter 14 · verse 1
1 Corinthians 14:1 in Telugu
ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి.
Prema kaligiyundutaku prayaasapadudi. Aatma sambandhamaina varamulanu aasaktito apekshinchudi; visheshamugaa meeru pravachanavaramu apekshinchudi.
1 Corinthians 14:1 in English
- King James Version (KJV)
- Follow after charity, and desire spiritual [gifts], but rather that ye may prophesy.
- World English Bible (WEB)
- Follow after love and earnestly desire spiritual gifts, but especially that you may prophesy.
- American Standard Version (ASV)
- Follow after love; yet desire earnestly spiritual [gifts], but rather that ye may prophesy.
- Bible in Basic English (BBE)
- Go after love; still desiring to have the things which the Spirit gives, but most of all that you may have the prophet's power.
- Darby Translation (DBY)
- Follow after love, and be emulous of spiritual [manifestations], but rather that ye may prophesy.
- Webster's Bible (WBS)
- Follow after charity, and desire spiritual [gifts] , but rather that ye may prophesy.
- Young's Literal Translation (YLT)
- Pursue the love, and seek earnestly the spiritual things, and rather that ye may prophecy,
Read in context
- 1ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి.
- 2ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకు చున్నాడు.
- 3క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాట లాడుచున్నాడు.
Cross references
- 1 Timothy 4:14 1 తిమోతికి 4:14పెద్దలు హస్తనిక్షేపణముచేయగా ప్రవచనమూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము.
- 1 Corinthians 16:14 1 కొరింథీయులకు 16:14మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి.
- 1 Corinthians 14:39 1 కొరింథీయులకు 14:39కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని,
- 1 Thessalonians 5:20 1 థెస్సలొనీకయులకు 5:20ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి.
- Hebrews 12:14 హెబ్రీయులకు 12:14అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.
- 1 Corinthians 12:1 1 కొరింథీయులకు 12:1మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరము లనుగూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు.
- 1 Corinthians 14:3–5 1 కొరింథీయులకు 14:3–5క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాట లాడుచున్నాడు. భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాట లాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.
- 1 Corinthians 13:13 1 కొరింథీయులకు 13:13కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.
- Proverbs 15:9 సామెతలు 15:9భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము నీతి ననుసరించువానిని ఆయన ప్రేమించును.
- 1 Timothy 6:11 1 తిమోతికి 6:11దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.
- 1 Peter 3:11–13 1 పేతురు 3:11–13అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములో ఆసక్తిగలవారైతే మీకు హానిచేయువాడెవడు?
- 1 Corinthians 14:24–25 1 కొరింథీయులకు 14:24–25అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును. అప్పుడతని హృదయరహస్యములు బయలుపడును. ఇందు వలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురముచేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును.