1 Corinthians · chapter 14 · verse 26
1 Corinthians 14:26 in Telugu
సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగు చున్నది? మీరు కూడి వచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు; మరియొకడు బోధింపవలెనని యున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటనచేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థము చెప్ప వలెనని యున్నాడు. సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి.
Sahodarulaaraa, yippudu meelo emi jarugu chunnadi? Meeru koodi vachchunappudu okadu oka keertana paadavalenani yunnaadu; mariyokadu bodhimpavalenani yunnaadu; mariyokadu tanaku bayalu parachabadinadi prakatanacheyavalenani yunnaadu; mariyokadu bhaashato maatalaadavalenani yunnaadu; mariyokadu arthamu cheppa valenani yunnaadu. Sare; samastamunu kshemaabhivruddhi kalugutakai jaruganiyyudi.
1 Corinthians 14:26 in English
- King James Version (KJV)
- How is it then, brethren? when ye come together, every one of you hath a psalm, hath a doctrine, hath a tongue, hath a revelation, hath an interpretation. Let all things be done unto edifying.
- World English Bible (WEB)
- What is it then, brothers? When you come together, each one of you has a psalm, has a teaching, has a revelation, has another language, or has an interpretation. Let all things be done to build each other up.
- American Standard Version (ASV)
- What is it then, brethren? When ye come together, each one hath a psalm, hath a teaching, hath a revelation, hath a tongue, hath an interpretation. Let all things be done unto edifying.
- Bible in Basic English (BBE)
- What is it then, my brothers? when you come together everyone has a holy song, or a revelation, or a tongue, or is giving the sense of it. Let everything be done for the common good.
- Darby Translation (DBY)
- What is it then, brethren? whenever ye come together, each [of you] has a psalm, has a teaching, has a tongue, has a revelation, has an interpretation. Let all things be done to edification.
- Webster's Bible (WBS)
- How is it then, brethren? when ye are assembled, every one of you hath a psalm, hath a doctrine, hath a language, hath a revelation, hath an interpretation. Let all things be done to edification.
- Young's Literal Translation (YLT)
- What then is it, brethren? whenever ye may come together, each of you hath a psalm, hath a teaching, hath a tongue, hath a revelation, hath an interpretation? let all things be for building up;
Read in context
- 24అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును.
- 25అప్పుడతని హృదయరహస్యములు బయలుపడును. ఇందు వలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురముచేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును.
- 26సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగు చున్నది? మీరు కూడి వచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు; మరియొకడు బోధింపవలెనని యున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటనచేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థము చెప్ప వలెనని యున్నాడు. సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి.
- 27భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్ప వలెను.
- 28అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును.
Cross references
- Ephesians 5:19 ఎఫెసీయులకు 5:19ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,
- 1 Corinthians 12:7–10 1 కొరింథీయులకు 12:7–10అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడు చున్నది. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరము లను మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి.
- Romans 14:19 రోమీయులకు 14:19కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము.
- 1 Thessalonians 5:11 1 థెస్సలొనీకయులకు 5:11కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.
- Ephesians 4:16 ఎఫెసీయులకు 4:16ఆయన శిరస్సయి యున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చ బడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది.
- 1 Corinthians 14:12–13 1 కొరింథీయులకు 14:12–13మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి. భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయవలెను.
- Ephesians 4:29 ఎఫెసీయులకు 4:29వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.
- 2 Corinthians 12:19 2 కొరింథీయులకు 12:19మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని యెదుటనే క్రీస్తునందు మాటలాడుచున్నాము; ప్రియులారా, మీ క్షేమాభివృద్ధికొరకు ఇవన్నియు చెప్పు చున్నాము.
- Ephesians 4:12 ఎఫెసీయులకు 4:12అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.
- 1 Corinthians 14:40 1 కొరింథీయులకు 14:40సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగ నియ్యుడి.
- 2 Corinthians 13:10 2 కొరింథీయులకు 13:10కాబట్టి నేను మీయొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక, మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారముచొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూర ముగా ఉండగానే యీ సంగతులు వ్రాయుచున్నాను.
- 1 Corinthians 14:4–6 1 కొరింథీయులకు 14:4–6భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాట లాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీయొద్దకు వచ్చి సత్యమును బయలు పరచవలెననియైనను జ్ఞానోపదేశము చేయ వలెనని యైనను ప్రవచింపవలెననియైనను బోధింపవలెనని యైనను మీతో మాటలాడకపోయిన యెడల, నావలన మీకు ప్రయోజనమేమి?
Original words (Greek)
- How · G5101τίς tís
- it · G2076ἐστί estí
- then · G3767οὖν oûn
- brethren · G80ἀδελφός adelphós
- when · G3752ὅταν hótan
- together · G4905συνέρχομαι synérchomai
- one · G1538ἕκαστος hékastos
- you · G5216ὑμῶν hymōn
- hath · G2192ἔχω échō
- psalm · G5568ψαλμός psalmós
- hath · G2192ἔχω échō
- doctrine · G1322διδαχή didachḗ
- hath · G2192ἔχω échō
- tongue · G1100γλῶσσα glōssa
- hath · G2192ἔχω échō
- revelation · G602ἀποκάλυψις apokálypsis
- hath · G2192ἔχω échō
- interpretation · G2058ἑρμηνεία hermēneía
- Let · G1096γίνομαι gínomai
- things · G3956πᾶς pâs
- done · G1096γίνομαι gínomai
- unto · G4314πρός prós
- edifying · G3619οἰκοδομή oikodomḗ