1 Corinthians · chapter 8 · verse 10
1 Corinthians 8:10 in Telugu
ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మన స్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా?
Elayanagaa jnyaanamugala neevu vigrahaalayamandu bhojanapanktini koorchundagaa okadu choochinayedala, balaheenamaina mana ssaakshigala atadu vigrahamulaku bali yiyyabadina padaarthamulanu tinutaku dhairyamu techchukonunu gadaa?
1 Corinthians 8:10 in English
- King James Version (KJV)
- For if any man see thee which hast knowledge sit at meat in the idol’s temple, shall not the conscience of him which is weak be emboldened to eat those things which are offered to idols;
- World English Bible (WEB)
- For if a man sees you who have knowledge sitting in an idol’s temple, won’t his conscience, if he is weak, be emboldened to eat things sacrificed to idols?
- American Standard Version (ASV)
- For if a man see thee who hast knowledge sitting at meat in an idol’s temple, will not his conscience, if he is weak, be emboldened to eat things sacrificed to idols?
- Bible in Basic English (BBE)
- For if a man sees you, who have knowledge, taking food as a guest in the house of an image, will it not give him, if he is feeble, the idea that he may take food offered to images?
- Darby Translation (DBY)
- For if any one see thee, who hast knowledge, sitting at table in an idol-house, shall not his conscience, he being weak, be emboldened to eat the things sacrificed to the idol?
- Webster's Bible (WBS)
- For if any man shall see thee, who hast knowledge, sit eating in the idol's temple, will not the conscience of him who is weak be emboldened to eat those things which are offered to idols;
- Young's Literal Translation (YLT)
- for if any one may see thee that hast knowledge in an idol's temple reclining at meat — shall not his conscience — he being infirm — be emboldened to eat the things sacrificed to idols,
Read in context
- 8భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు.
- 9అయినను మీకు కలిగియున్న యీస్వాతంత్ర్యమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి.
- 10ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మన స్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా?
- 11అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును.
- 12ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు.
Cross references
- 1 Corinthians 10:28–29 1 కొరింథీయులకు 10:28–29అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల?
- Romans 14:23 రోమీయులకు 14:23అనుమానించువాడు తినినయెడల విశ్వాసము లేకుండ తినును, గనుక దోషి యని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.
- 1 Corinthians 10:20–21 1 కొరింథీయులకు 10:20–21లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీదఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు.
- 1 Corinthians 8:4 1 కొరింథీయులకు 8:4కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము: లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.
- 1 Corinthians 8:7 1 కొరింథీయులకు 8:7అయితే అందరియందు ఈ జ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు; ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది.
- Romans 14:14 రోమీయులకు 14:14సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని యెంచుకొనువానికి అది నిషిద్ధమే.
- 1 Corinthians 8:1–2 1 కొరింథీయులకు 8:1–2విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయము: మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒకడు తనకేమైనను తెలియుననుకొని యుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు.
- Numbers 25:2 సంఖ్యాకాండము 25:2ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి.
- Judges 9:27 న్యాయాధిపతులు 9:27వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా
- Amos 2:8 ఆమోసు 2:8తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలి పీఠములన్నిటియొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు.
- 1 Corinthians 10:32 1 కొరింథీయులకు 10:32యూదులకైనను, గ్రీసుదేశస్థుల కైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగ జేయకుడి.
Original words (Greek)
- For · G1063γάρ gár
- if · G1437ἐάν eán
- man · G5100τὶς tìs
- see · G1492εἴδω eídō
- thee · G4571σέ sé
- hast · G2192ἔχω échō
- knowledge · G1108γνῶσις gnōsis
- meat · G2621κατάκειμαι katákeimai
- in · G1722ἐν en
- idol’s temple · G1493εἰδωλεῖον eidōleîon
- shall · G3618οἰκοδομέω oikodoméō
- not · G3780οὐχί ouchí
- conscience · G4893συνείδησις syneídēsis
- him · G846αὐτός autós
- is · G5607ὤν ṓn
- weak · G772ἀσθενής asthenḗs
- emboldened · G3618οἰκοδομέω oikodoméō
- eat · G2068ἐσθίω esthíō
- idols · G1494εἰδωλόθυτον eidōlóthyton