1 Kings · chapter 11 · verse 3
1 Kings 11:3 in Telugu
అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందల మంది ఉప పత్నులును కలిగియుండిరి; అతని భార్యలు అతని హృదయ మును త్రిప్పివేసిరి.
Ataniki edu vandalamandi raajakumaartelaina bhaaryalunu mooduvandala mandi upa patnulunu kaligiyundiri; atani bhaaryalu atani hrudaya munu trippivesiri.
1 Kings 11:3 in English
- King James Version (KJV)
- And he had seven hundred wives, princesses, and three hundred concubines: and his wives turned away his heart.
- World English Bible (WEB)
- He had seven hundred wives, princesses, and three hundred concubines. His wives turned his heart away.
- American Standard Version (ASV)
- And he had seven hundred wives, princesses, and three hundred concubines; and his wives turned away his heart.
- Bible in Basic English (BBE)
- He had seven hundred wives, daughters of kings, and three hundred other wives; and through his wives his heart was turned away.
- Darby Translation (DBY)
- And he had seven hundred wives, princesses, and three hundred concubines; and his wives turned away his heart.
- Webster's Bible (WBS)
- And he had seven hundred wives, princesses, and three hundred concubines: and his wives turned away his heart.
- Young's Literal Translation (YLT)
- And he hath women, princesses, seven hundred, and concubines three hundred; and his wives turn aside his heart.
Read in context
- 1మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయ ములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీ యులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి
- 2కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.
- 3అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందల మంది ఉప పత్నులును కలిగియుండిరి; అతని భార్యలు అతని హృదయ మును త్రిప్పివేసిరి.
- 4సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను.
- 5సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను.
Cross references
- 2 Samuel 5:13–16 2 సమూయేలు 5:13–16దావీదు హెబ్రోనునుండి వచ్చిన తరువాత యెరూష లేములోనుండి యింక అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసికొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులును కుమార్తెలును పుట్టిరి యెరూషలేములో అతనికి పుట్టినవారెవరనగా షమ్మూ యషోబాబు నాతాను సొలొమోను ఇభారు ఏలీషూవ నెపెగు యాఫీయ ఎలీషామా ఎల్యాదా ఎలీపేలెటు అనువారు.
- Ecclesiastes 7:28 ప్రసంగి 7:28అదేదనగా వెయ్యిమంది పురుషు లలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు.
- Judges 9:5 న్యాయాధిపతులు 9:5తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి యింటికి పోయి యెరుబ్బయలు కుమారు లును తన సహోదరులునైన ఆ డెబ్బదిమంది మనుష్యులను ఒక్క రాతిమీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనెను.
- 2 Samuel 3:2–5 2 సమూయేలు 3:2–5హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా, అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయు రాలగు అహీనోయమువలన పుట్టెను. కిల్యాబు అను రెండవవాడు కర్మెలీయుడగు నాబాలు భార్యయైన అబీగ యీలు వలన పుట్టెను. మూడవవాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకావలన పుట్టెను. నాలుగవవాడగు అదోనీయా హగ్గీతువలన పుట్టెను. అయిదవవాడగు షెఫట్య అబీటలువలన పుట్టెను. ఆరవవాడగు ఇత్రెయాము దావీదునకు భార్యయగు ఎగ్లావలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు.
- 2 Chronicles 11:21 2 దినవృత్తాంతములు 11:21రెహబాము పదునెనిమిదిమంది భార్యలను పెండ్లిచేసికొని అరువదిమంది ఉపపత్నులను తెచ్చుకొని యిరువది యెనిమిదిమంది కుమా రులను అరువదిమంది కుమార్తెలను కనెను; అయితే తన భార్యలందరికంటెను ఉపపత్ను లందరికంటెను అబ్షా లోము కుమార్తెయైన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించెను.
- Judges 8:30–31 న్యాయాధిపతులు 8:30–31గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బదిమంది కుమారులు అతని కుండిరి. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతని కొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను.