1 Kings · chapter 17 · verse 20
1 Kings 17:20 in Telugu
యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన యీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమెమీదికి కీడు రాజేసితివా అని యెహో వాకు మొఱ్ఱపెట్టి
Yehovaa naa devaa, nannu cherchukonina yee vidhavaraali kumaaruni champunantagaa aamemeediki keedu raajesitivaa ani yeho vaaku morrapetti
1 Kings 17:20 in English
- King James Version (KJV)
- And he cried unto the LORD, and said, O LORD my God, hast thou also brought evil upon the widow with whom I sojourn, by slaying her son?
- World English Bible (WEB)
- He cried to the LORD and said, “LORD my God, have you also brought evil on the widow with whom I am staying, by killing her son?”
- American Standard Version (ASV)
- And he cried unto Jehovah, and said, O Jehovah my God, hast thou also brought evil upon the widow with whom I sojourn, by slaying her son?
- Bible in Basic English (BBE)
- And crying to the Lord he said, O Lord my God, have you sent evil even on the widow whose guest I am, by causing her son's death?
- Darby Translation (DBY)
- And he cried to Jehovah and said, Jehovah, my God, hast thou also brought evil upon the widow with whom I sojourn, by slaying her son?
- Webster's Bible (WBS)
- And he cried to the LORD, and said, O LORD my God, hast thou also brought evil upon the widow with whom I sojourn, by slaying her son?
- Young's Literal Translation (YLT)
- and crieth unto Jehovah, and saith, 'Jehovah my God, also on the widow with whom I am sojourning hast Thou done evil — to put her son to death?'
Read in context
- 18ఆమె ఏలీయాతోదైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా
- 19అతడునీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి, ఆమె కౌగిటిలోనుండి వానిని తీసికొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచముమీద వాని పరుండబెట్టి
- 20యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన యీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమెమీదికి కీడు రాజేసితివా అని యెహో వాకు మొఱ్ఱపెట్టి
- 21ఆ చిన్న వానిమీద ముమ్మారు తాను పారచాచుకొనియెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్న వానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా
- 22యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను.
Cross references
- Matthew 21:22 మత్తయి 21:22మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.
- James 5:15–18 యాకోబు 5:15–18విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును. ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమిమీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను.
- Psalm 99:6 కీర్తనలు 99:6ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి కుత్తరమిచ్చెను.
- 2 Kings 19:15 2 రాజులు 19:15యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెనుయెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యా కాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోక మందున్న సకల రాజ్యములకు దేవుడవైయున్నావు.
- Exodus 17:4 నిర్గమకాండము 17:4అప్పుడు మోషే యెహోవాకు మొఱపెట్టుచు - ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదు రనెను.
- Genesis 18:23–25 ఆదికాండము 18:23–25అప్పడు అబ్రాహాము సమీపించి యిట్లనెను దుష్టులతో కూడ నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండిన యెడల దానిలో నున్న యేబదిమంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు
- 1 Kings 18:36–37 1 రాజులు 18:36–37అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెనుయెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము.
- Joshua 7:8–9 యెహోషువ 7:8–9ప్రభువా కనికరించుము; ఇశ్రాయేలీ యులు తమ శత్రువులయెదుట నిలువలేక వెనుకకు తిరిగి నందుకు నేనేమి చెప్పగలను? కనానీయులును ఈ దేశ నివాసులందరును విని, మమ్మును చుట్టుకొని మా పేరు భూమిమీద ఉండకుండ తుడిచివేసిన యెడల, ఘనమైన నీ నామమునుగూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా
- 1 Samuel 7:8–9 1 సమూయేలు 7:8–9మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మాకొరకు ఆయనను ప్రార్థనచేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, ఇశ్రా యేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను.
- Jeremiah 12:1 యిర్మీయా 12:1యెహోవా, నేను నీతో వాదించునప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు; అయినను న్యాయము విధించుటనుగూర్చి నేను నీతో మాటలాడుదును; దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల? మహా విశ్వాసఘాతకులు సుఖింపనేల?
- 2 Kings 19:4 2 రాజులు 19:4జీవముగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నియు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.
- Psalm 73:13–14 కీర్తనలు 73:13–14నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.