1 Kings · chapter 4 · verse 5
1 Kings 4:5 in Telugu
నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను; నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునైయుండెను;
Naataanu kumaarudaina ajaryaa adhikaarula meeda undenu; naataanu kumaarudaina jaaboodu raaju samukhamuloni mitrudunu mantriyunaiyundenu;
1 Kings 4:5 in English
- King James Version (KJV)
- And Azariah the son of Nathan [was] over the officers: and Zabud the son of Nathan [was] principal officer, [and] the king’s friend:
- World English Bible (WEB)
- Azariah the son of Nathan was over the officers; Zabud the son of Nathan was chief minister, the king’s friend;
- American Standard Version (ASV)
- and Azariah the son of Nathan was over the officers; and Zabud the son of Nathan was chief minister, [and] the king’s friend;
- Bible in Basic English (BBE)
- Azariah, the son of Nathan, was over those in authority in the different divisions of the country; Zabud, the son of Nathan, was priest and the king's friend;
- Darby Translation (DBY)
- and Azariah the son of Nathan was over the superintendents; and Zabud the son of Nathan was principal officer, the king's friend;
- Webster's Bible (WBS)
- And Azariah the son of Nathan [was] over the officers: and Zabud the son of Nathan [was] principal officer, [and] the king's friend:
- Young's Literal Translation (YLT)
- and Azariah son of Nathan [is] over the officers; and Zabud son of Nathan [is] minister, friend of the king;
Read in context
- 3షీషా కుమారులైన ఎలీహోరెపును అహీయాయును ప్రధాన మంత్రులు; అహీలూదుకుమారుడైన యెహోషాపాతు లేఖికుడై యుండెను;
- 4యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి; సాదోకును అబ్యాతారును యాజకులు.
- 5నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను; నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునైయుండెను;
- 6అహీషారు గృహ నిర్వాహకుడు; అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయములో అధికారి.
- 7ఇశ్రా యేలీయులందరిమీద సొలొమోను పన్నిద్దరు అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను.
Cross references
- 2 Samuel 16:16 2 సమూయేలు 16:16దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషైయను నతడు అబ్షాలోమునొద్దకువచ్చి అతని దర్శించి రాజు చిరంజీవి యగును గాక రాజు చిరంజీవియగును గాక అని పలుకగా
- 1 Chronicles 27:33 1 దినవృత్తాంతములు 27:33అహీతోపెలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు.
- 2 Samuel 15:37 2 సమూయేలు 15:37దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చు చుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను.
- 2 Samuel 12:1–15 2 సమూయేలు 12:1–15కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను; అతడు వచ్చి దావీదుతో ఇట్లనెనుఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి. ఒకడు ఐశ్వర్య వంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొఱ్ఱెలును గొడ్లును కలిగియుండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన యొక చిన్న ఆడు గొఱ్ఱె పిల్ల తప్ప ఏమియు లేకపోయెను. వాడు దానిని పెంచు కొనుచుండగా అది వానియొద్దను వాని బిడ్డలయొద్దను ఉండి పెరిగి వాని చేతిముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తెవలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తనయొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొఱ్ఱెలలోగాని గొడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొఱ్ఱెపిల్లను పట్టుకొని, తన యొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యునిమీద బహుగా కోపించు కొనియెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు. వాడు కని కరము లేక యీ కార్యము చేసెను గనుక ఆ గొఱ్ఱె పిల్లకు ప్రతిగా నాలుగు గొఱ్ఱెపిల్లల నియ్యవలెనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచిఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమ నగాఇశ్రాయేలీయులమీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి సౌలు చేతిలోనుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకను గ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితి వేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని యున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా? నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చున దేమనగానీ యింటివారి మూలముననే నేను నీకు అపా యము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికప్పగించెదను. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను. నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతానునీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను.
- 2 Samuel 12:25 2 సమూయేలు 12:25యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞనుబట్టి యదీద్యా అని అతనికి పేరు పెట్టెను.
- Proverbs 22:11 సామెతలు 22:11హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును.
- James 2:23 యాకోబు 2:23కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను.
- 2 Samuel 20:26 2 సమూయేలు 20:26సాదోకును అబ్యాతారును యాజకులు; యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు1.
- 2 Samuel 19:37–38 2 సమూయేలు 19:37–38నేను నా ఊరి యందుండి మరణమై నా తలిదండ్రుల సమాధియందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగి పోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము, నీ దాసుడగు కింహాము నా యేలిన వాడవును రాజవునగు నీతోకూడ వచ్చుటకు సెలవిమ్ము; నీ దృష్టికి ఏది యనుకూలమో దానిని అతనికి చేయుమని మనవి చేయగా రాజుకింహాము నాతోకూడ రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసెదను, మరియు నావలన నీవు కోరునదంతయు నేను చేసెదనని సెలవిచ్చెను.
- John 15:14–15 యోహాను 15:14–15నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.
- 2 Samuel 7:2 2 సమూయేలు 7:2నేను దేవదారుమ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా
- John 13:23 యోహాను 13:23ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను