2 Chronicles · chapter 4 · verse 20
2 Chronicles 4:20 in Telugu
వాటినిగూర్చిన విధిప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను,
Vaatinigoorchina vidhiprakaaramu garbhaalayamu eduta veluguchundutakai prashastamaina bangaarapu deepastambhamulanu,
2 Chronicles 4:20 in English
- King James Version (KJV)
- Moreover the candlesticks with their lamps, that they should burn after the manner before the oracle, of pure gold;
- World English Bible (WEB)
- and the lamp stands with their lamps to burn according to the ordinance before the inner sanctuary, of pure gold;
- American Standard Version (ASV)
- and the candlesticks with their lamps, to burn according to the ordinance before the oracle, of pure gold;
- Bible in Basic English (BBE)
- And the supports for the lights with their lights, to be burning in the regular way in front of the inmost room, of the best gold;
- Darby Translation (DBY)
- and the candlesticks with their lamps to burn according to the ordinance before the oracle, of pure gold;
- Webster's Bible (WBS)
- Moreover the candlesticks with their lamps, that they should burn after the manner before the oracle, of pure gold;
- Young's Literal Translation (YLT)
- and the candlesticks, and their lamps, for their burning according to the ordinance, before the oracle, of gold refined;
Read in context
- 18ఎత్తు చూడ లేనంత యిత్తడి తన యొద్ద నుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటిని బహు విస్తారముగా చేయించెను.
- 19దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటిని బంగారపు పీఠమును సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను,
- 20వాటినిగూర్చిన విధిప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను,
- 21పుష్పములను ప్రమిదెలను కత్తెరలను కారులను తొట్లను గిన్నెలను ధూపకలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను.
- 22మరియు మందిరద్వారము లోపలి తలుపులును అతి పరిశుద్ధ స్థలముయొక్క లోపలి తలుపులును దేవాలయపు తలుపులును అన్నియు బంగార ముతో చేయబడెను.
Cross references
- Exodus 25:31–37 నిర్గమకాండము 25:31–37మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను; నకిషిపనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయ వలెను; దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమైయుండవలెను. దీప వృక్షముయొక్క ఒక ప్రక్కనుండి మూడుకొమ్మలు, దీపవృక్షముయొక్క రెండవ ప్రక్కనుండి మూడు కొమ్మలు, అనగా దాని ప్రక్కలనుండి ఆరుకొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షమునుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములును వాటి మొగ్గలును వాటి పువ్వులును ఉండవలెను, దీపవృక్ష ప్రకాండమునుండి నిగుడు ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గచొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును; అదంతయు మేలిమి బంగారుతో చేయ బడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలెను. నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను.
- 2 Chronicles 4:7 2 దినవృత్తాంతములు 4:7మరియు వాటిని గూర్చిన విధి ననుసరించి పది బంగారపు దీపస్తంభములను చేయించి, దేవాలయమందు కుడి తట్టున అయిదును ఎడమ తట్టున అయిదును ఉంచెను.
- Psalm 28:2 కీర్తనలు 28:2నేను నీకు మొఱ్ఱపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము.
- 1 Kings 6:16–17 1 రాజులు 6:16–17మరియు మందిరపు ప్రక్కలను దిగువనుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల యెత్తు కట్టించెను; వీటిని గర్భాలయమునకై, అనగా అతిపరిశుద్ద మైన స్థలమునకై అతడు లోపల కట్టించెను. అయితే దాని ముందరనున్న పరిశుద్ధస్థలము నలువది మూరల పొడుగై యుండెను.
- 1 Kings 8:6 1 రాజులు 8:6మరియు యాజకులు యెహోవానిబంధన మందస మును తీసికొని దాని స్థలములో, అనగా మందిరపు గర్బా ల యమగు అతిపరిశుద్ధ స్థలములో, కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి.
- Exodus 27:20–21 నిర్గమకాండము 27:20–21మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీ యుల కాజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములవరకు నిత్యమైన కట్టడ.
- 1 Kings 6:5 1 రాజులు 6:5మరియు మందిరపు గోడచుట్టు గదులు కట్టించెను; మంది రపు గోడలకును పరిశుద్ధస్థలమునకును గర్భాలయమునకును చుట్టు నలుదిశల అతడు గదులు కట్టించెను.