2 Chronicles · chapter 4 · verse 21
2 Chronicles 4:21 in Telugu
పుష్పములను ప్రమిదెలను కత్తెరలను కారులను తొట్లను గిన్నెలను ధూపకలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను.
Pushpamulanu pramidelanu katteralanu kaarulanu totlanu ginnelanu dhoopakalashamulanu solomonu melimi bangaaramuto cheyinchenu.
2 Chronicles 4:21 in English
- King James Version (KJV)
- And the flowers, and the lamps, and the tongs, [made he of] gold, [and] that perfect gold;
- World English Bible (WEB)
- and the flowers, the lamps, and the tongs of gold that was purest gold;
- American Standard Version (ASV)
- and the flowers, and the lamps, and the tongs, of gold, and that perfect gold;
- Bible in Basic English (BBE)
- The flowers and the vessels for the lights and the instruments used for them, were all of gold; it was the best gold.
- Darby Translation (DBY)
- and the flowers, and the lamps, and the tongs, of gold (it was perfect gold);
- Webster's Bible (WBS)
- And the flowers, and the lamps, and the tongs, [made he of] gold, [and] that perfect gold;
- Young's Literal Translation (YLT)
- and the flowers, and the lamps, and the tongs of gold — it [is] the perfection of gold;
Read in context
- 19దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటిని బంగారపు పీఠమును సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను,
- 20వాటినిగూర్చిన విధిప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను,
- 21పుష్పములను ప్రమిదెలను కత్తెరలను కారులను తొట్లను గిన్నెలను ధూపకలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను.
- 22మరియు మందిరద్వారము లోపలి తలుపులును అతి పరిశుద్ధ స్థలముయొక్క లోపలి తలుపులును దేవాలయపు తలుపులును అన్నియు బంగార ముతో చేయబడెను.
Cross references
- 1 Kings 6:18 1 రాజులు 6:18మందిరములోపలనున్న దేవదారు పలకలమీద గుబ్బలును వికసించిన పువ్వులును చెక్కబడి యుండెను; అంతయు దేవదారుకఱ్ఱ పనియే, రాయి యొకటైన కనబడలేదు.
- Exodus 25:31–40 నిర్గమకాండము 25:31–40మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను; నకిషిపనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయ వలెను; దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమైయుండవలెను. దీప వృక్షముయొక్క ఒక ప్రక్కనుండి మూడుకొమ్మలు, దీపవృక్షముయొక్క రెండవ ప్రక్కనుండి మూడు కొమ్మలు, అనగా దాని ప్రక్కలనుండి ఆరుకొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షమునుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములును వాటి మొగ్గలును వాటి పువ్వులును ఉండవలెను, దీపవృక్ష ప్రకాండమునుండి నిగుడు ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గచొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును; అదంతయు మేలిమి బంగారుతో చేయ బడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలెను. నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర దాని కత్తెరచిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్ని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము.
- 2 Chronicles 4:5 2 దినవృత్తాంతములు 4:5అది బెత్తెడు దళముగలది, దాని అంచు గిన్నెయంచువంటిదై తామర పుష్పములు తేల్చబడియుండెను; అది ముప్పది పుట్ల నీళ్లు పట్టును.
- Exodus 37:20 నిర్గమకాండము 37:20మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులుగల బాదమురూపమైన నాలుగు కలశము లుండెను.
- 1 Kings 6:35 1 రాజులు 6:35వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొది గించెను.
- 1 Kings 6:29 1 రాజులు 6:29మరియు మందిరపు గోడ లన్నిటిమీదను లోపల నేమి వెలుపల నేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కిం చెను.