2 Corinthians · chapter 8 · verse 3
2 Corinthians 8:3 in Telugu
ఈ కృపవిషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు,
Ee krupavishayamulonu, parishuddhulakorakaina paricharyalo paalupondu vishayamulonu, manahpoorvakamugaa mammunu vedukonuchu,
2 Corinthians 8:3 in English
- King James Version (KJV)
- For to [their] power, I bear record, yea, and beyond [their] power [they were] willing of themselves;
- World English Bible (WEB)
- For according to their power, I testify, yes and beyond their power, they gave of their own accord,
- American Standard Version (ASV)
- For according to their power, I bear witness, yea and beyond their power, [they gave] of their own accord,
- Bible in Basic English (BBE)
- For I give them witness, that as they were able, and even more than they were able, they gave from the impulse of their hearts,
- Darby Translation (DBY)
- For according to [their] power, I bear witness, and beyond [their] power, [they were] willing of their own accord,
- Webster's Bible (WBS)
- For to [their] power, I bear testimony, and even beyond [their] power, [they were] willing of themselves;
- Young's Literal Translation (YLT)
- because, according to [their] power, I testify, and above [their] power, they were willing of themselves,
Read in context
- 1సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అను గ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి మీకు తెలియ జేయుచున్నాము.
- 2ఏలాగనగా, వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను.
- 3ఈ కృపవిషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు,
- 4వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.
- 5ఇదియుగాక మొదట ప్రభువునకును, దేవుని చిత్తమువలన మాకును, తమ్మును తామే అప్పగించుకొనిరి; యింతగా చేయుదురని మేమనుకొనలేదు.
Cross references
- Exodus 35:5 నిర్గమకాండము 35:5మీరు మీలోనుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవనిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి,
- Exodus 35:29 నిర్గమకాండము 35:29మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరు మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి.
- Exodus 35:21–22 నిర్గమకాండము 35:21–22తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క పనికొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలుగాని పురుషులుగాని యెవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరు యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను తావళ ములను, సమస్తవిధమైన బంగారు వస్తువులనుతెచ్చిరి.
- 2 Corinthians 9:6–7 2 కొరింథీయులకు 9:6–7కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును. సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.
- Philemon 1:14 ఫిలేమోనుకు 1:14నీ ఉపకారము బలవంతముచేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని, నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టములేదు.
- 1 Corinthians 16:2 1 కొరింథీయులకు 16:2నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.
- 1 Chronicles 29:9 1 దినవృత్తాంతములు 29:9వారు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు ఆలాగు మనః పూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి.
- 1 Corinthians 9:17 1 కొరింథీయులకు 9:17ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను.
- Acts 11:29 అపొస్తలుల కార్యములు 11:29అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తికొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పుంపుటకు నిశ్చయించుకొనెను.
- 1 Chronicles 29:5–6 1 దినవృత్తాంతములు 29:5–6ఈ దినమునయెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైన మీలో ఉన్నారా? అప్పుడు పితరుల యిండ్లకు అధిపతులును ఇశ్రాయేలీయుల గోత్రపు అధి పతులును సహస్రాధిపతులును శతాధిపతులును రాజు పనిమీద నియమింపబడిన అధిపతులును కలసి
- 1 Chronicles 29:13–17 1 దినవృత్తాంతములు 29:13–17మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము. మా పితరులందరివలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై యున్నాము, మా భూనివాసకాలము నీడ యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామముయొక్క ఘనతకొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన యీ వస్తుసముదాయమును నీవలన కలిగినదే, అంతయు నీదియై యున్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి యున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను.
- Philippians 2:13 ఫిలిప్పీయులకు 2:13ఎందుకనగా మీరు ఇచ్ఛయించుట కును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.