2 Kings · chapter 3 · verse 15
2 Kings 3:15 in Telugu
నాయొద్దకు వీణ వాయించగల యొకనిని తీసి కొనిరమ్ము. వాద్యకు డొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను.
Naayoddaku veena vaayinchagala yokanini teesi konirammu. Vaadyaku dokadu vachchi vaayinchuchundagaa yehovaa hastamu atanimeediki vachchenu ganuka atadu ee maata prakatana chesenu.
2 Kings 3:15 in English
- King James Version (KJV)
- But now bring me a minstrel. And it came to pass, when the minstrel played, that the hand of the LORD came upon him.
- World English Bible (WEB)
- But now bring me a musician.” When the musician played, the LORD’s hand came on him.
- American Standard Version (ASV)
- But now bring me a minstrel. And it came to pass, when the minstrel played, that the hand of Jehovah came upon him.
- Bible in Basic English (BBE)
- But now, get me a player of music, and it will come about that while the man is playing, the hand of the Lord will come on me and I will give you the word of the Lord: and they got a player of music, and while the man was playing, the hand of the Lord was on him.
- Darby Translation (DBY)
- And now fetch me a minstrel. And it came to pass when the minstrel played, that the hand of Jehovah was upon him.
- Webster's Bible (WBS)
- But now bring me a minstrel. And it came to pass, when the minstrel played, that the hand of the LORD came upon him.
- Young's Literal Translation (YLT)
- and now, bring to me a minstrel; and it hath been, at the playing of the minstrel, that the hand of Jehovah is on him,
Read in context
- 13ఎలీషా ఇశ్రాయేలురాజును చూచినాతో నీకు నిమిత్తమేమి? నీ తలిదండ్రులుంచుకొనిన ప్రవక్తలయొద్దకు పొమ్మని చెప్పెను. ఆలాగనవద్దు, మోయాబీయులచేతికి అప్పగింపవలెనని యెహోవా, రాజులమైన మా ముగ్గురిని పిలిచెనని ఇశ్రాయేలురాజు అతనితో అనినప్పుడు
- 14ఎలీషా ఇట్లనెనుఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదారాజైన యెహోషా పాతును నేను గౌరవము చేయనియెడల నిన్ను చూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును.
- 15నాయొద్దకు వీణ వాయించగల యొకనిని తీసి కొనిరమ్ము. వాద్యకు డొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను.
- 16యెహోవా సెలవిచ్చినదేమనగాఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి;
- 17యెహోవా సెలవిచ్చునదేమనగాగాలియే గాని వర్షమే గాని రాక పోయినను, మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును.
Cross references
- 1 Samuel 16:23 1 సమూయేలు 16:23దేవునియొద్దనుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్ల దావీదు సితారా చేతపట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను.
- Ephesians 5:18–19 ఎఫెసీయులకు 5:18–19మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి. ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,
- 1 Samuel 10:5 1 సమూయేలు 10:5ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు, అచ్చట ఊరిదగ్గరకు నీవు రాగానే, స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటనచేయుచు వత్తురు;
- Ezekiel 1:3 యెహెజ్కేలు 1:3యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షముకాగా అక్కడనే యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను.
- 1 Kings 18:46 1 రాజులు 18:46యెహోవా హస్తము ఏలీయానుబలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబుకంటె ముందుగా పరుగెత్తికొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను.
- Ezekiel 8:1 యెహెజ్కేలు 8:1ఆరవ సంవత్సరము ఆరవ నెల అయిదవ దినమున నేను నా యింట కూర్చునియుండగాను యూదా పెద్దలు నా యెదుట కూర్చుండియుండగాను ప్రభువైన యెహోవా హస్తము నామీదికి వచ్చెను.
- 1 Chronicles 25:1–3 1 దినవృత్తాంతములు 25:1–3మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవావృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అషర్యేలా అనువారు. యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతి క్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు.
- Acts 11:21 అపొస్తలుల కార్యములు 11:21ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువుతట్టు తిరిగిరి.
- 1 Samuel 18:10 1 సమూయేలు 18:10మరునాడు దేవునియొద్దనుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించు చుండగా దావీదు మునుపటిలాగున వీణచేత పట్టుకొని వాయించెను.
- Ezekiel 3:14 యెహెజ్కేలు 3:14ఆత్మ నన్నెత్తి తోడు కొనిపోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్నిచేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొనిపోయినప్పుడు, యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను.
- Ezekiel 3:22 యెహెజ్కేలు 3:22అక్కడ యెహోవా హస్తము నామీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్లుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను.