Acts · chapter 13 · verse 18
Acts 13:18 in Telugu
యించుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను.
Yinchuminchu naluvadi endlamattuku aranyamulo vaari cheshtalanu sahinchenu.
Acts 13:18 in English
- King James Version (KJV)
- And about the time of forty years suffered he their manners in the wilderness.
- World English Bible (WEB)
- For a period of about forty years he put up with them in the wilderness.
- American Standard Version (ASV)
- And for about the time of forty years as a nursing-father bare he them in the wilderness.
- Bible in Basic English (BBE)
- And for about forty years he put up with their ways in the waste land.
- Darby Translation (DBY)
- and for a time of about forty years he nursed them in the desert.
- Webster's Bible (WBS)
- And about the time of forty years he suffered their manners in the wilderness.
- Young's Literal Translation (YLT)
- and about a period of forty years He did suffer their manners in the wilderness,
Read in context
- 16అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను
- 17ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై యున్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, తన భుజబలముచేత వారినక్కడనుండి తీసికొనివచ్చి
- 18యించుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను.
- 19మరియు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనముచేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి యిచ్చెను.
- 20ఇంచుమించు నాలుగువందల ఏబది సంవత్సరములు ఇట్లు జరిగెను. అటుతరువాత ప్రవక్తయైన సమూయేలువరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయ చేసెను.
Cross references
- Acts 7:36 అపొస్తలుల కార్యములు 7:36ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను.
- Psalm 95:8–11 కీర్తనలు 95:8–11అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించివీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని.
- Amos 5:25–26 ఆమోసు 5:25–26ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా? మీరు మీ దేవతయైన మోలెకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసికొని వచ్చితిరి గదా.
- Nehemiah 9:16–21 నెహెమ్యా 9:16–21అయితే వారును మా పితరులును గర్వించి, లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గక పోయిరి. వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసికొనక తమ మనస్సును కఠినపరచు కొని, తాముండి వచ్చిన దాస్యపుదేశమునకు తిరిగి వెళ్లుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగు బాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంత మును బహు కృపయు గలవాడవునై యుండి వారిని విసర్జింపలేదు. వారు ఒక పోతదూడను చేసికొనిఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి, నీకు బహు విసుకు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగినవాడవై వారిని విసర్జింపలేదు; మార్గముగుండ వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలు గిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపైనుండి వెళ్లిపోక నిలిచెను. వారికి భోధించుటకు నీ యుపకారాత్మను దయ చేసితివి, నీ విచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు; వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమియు తక్కువ కాకుండ నలువది సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకువాపు రాలేదు.
- Numbers 14:33–34 సంఖ్యాకాండము 14:33–34మీ శవములు ఈ అరణ్యములో క్షయమగువరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచారశిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు.
- Exodus 16:35 నిర్గమకాండము 16:35ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలుబది యేండ్లు మన్నానే తిను చుండిరి; వారు కనానుదేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి.
- Hebrews 3:7–10 హెబ్రీయులకు 3:7–10మరియు పరిశుద్ధాత్మయిట్లు చెప్పుచున్నాడు. నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరమువారివలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నా మార్గములను తెలిసికొనలేదు.
- Deuteronomy 1:31 ద్వితీయోపదేశకాండము 1:31ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని.
- Hebrews 3:16–19 హెబ్రీయులకు 3:16–19విని కోపము పుట్టించినవారెవరు? మోషేచేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినవారందరే గదా ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారి మీదనే గదా? వారి శవములు అరణ్యములో రాలి పోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైనవారినిగూర్చియే గదా కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము.
- Acts 7:39–43 అపొస్తలుల కార్యములు 7:39–43ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము; ఐగుప్తు దేశములోనుండి మనలను తోడుకొని వచ్చిన యీ మోషే యేమాయెనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి నర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది. ఇశ్రాయేలు ఇంటివారలారా మీరు అరణ్యములో నలువది యేండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా? మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలొకు గుడారమును రొంఫాయను దేవతయొక్క నక్షత్రమును మోసికొని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను.
- Numbers 14:22 సంఖ్యాకాండము 14:22నేను ఐగుప్తులోను అరణ్యము లోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి.
- Exodus 16:2 నిర్గమకాండము 16:2ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనులమీద సణిగెను.