Hebrews · chapter 3 · verse 16
Hebrews 3:16 in Telugu
విని కోపము పుట్టించినవారెవరు? మోషేచేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినవారందరే గదా
Vini kopamu puttinchinavaarevaru? Moshecheta nadipimpabadi aiguptulo nundi bayaluderi vachchinavaarandare gadaa
Hebrews 3:16 in English
- King James Version (KJV)
- For some, when they had heard, did provoke: howbeit not all that came out of Egypt by Moses.
- World English Bible (WEB)
- For who, when they heard, rebelled? Wasn’t it all those who came out of Egypt led by Moses?
- American Standard Version (ASV)
- For who, when they heard, did provoke? nay, did not all they that came out of Egypt by Moses?
- Bible in Basic English (BBE)
- Who made him angry when his voice came to them? was it not all those who came out of Egypt with Moses?
- Darby Translation (DBY)
- (for who was it, who, having heard, provoked? but [was it] not all who came out of Egypt by Moses?
- Webster's Bible (WBS)
- For some, when they had heard, did provoke: yet, not all that came out of Egypt by Moses.
- Young's Literal Translation (YLT)
- for certain having heard did provoke, but not all who did come out of Egypt through Moses;
Read in context
- 14పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి.
- 15ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.
- 16విని కోపము పుట్టించినవారెవరు? మోషేచేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినవారందరే గదా
- 17ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారి మీదనే గదా? వారి శవములు అరణ్యములో రాలి పోయెను.
- 18తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైనవారినిగూర్చియే గదా
Cross references
- Numbers 14:2 సంఖ్యాకాండము 14:2మరియు ఇశ్రా యేలీయులందరు మోషే అహరోనుల పైని సణుగుకొనిరి.
- Numbers 14:30 సంఖ్యాకాండము 14:30యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణముచేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు; ఇది నిశ్చయము.
- Numbers 26:65 సంఖ్యాకాండము 26:65ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారినిగూర్చి సెలవిచ్చెను. యెపున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.
- Deuteronomy 1:38 ద్వితీయోపదేశకాండము 1:38అతడు ఇశ్రా యేలీయులు దాని స్వాధీనపరచుకొన చేయును గనుక అతని ధైర్యపరచుము.
- Psalm 78:17 కీర్తనలు 78:17అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపముచేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి.
- Numbers 14:24 సంఖ్యాకాండము 14:24నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను.
- Numbers 14:4 సంఖ్యాకాండము 14:4వారుమనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్లుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా
- Numbers 14:38 సంఖ్యాకాండము 14:38అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రదికిరి.
- Romans 11:4–5 రోమీయులకు 11:4–5అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను. ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది.
- Deuteronomy 1:35–36 ద్వితీయోపదేశకాండము 1:35–36బహుగా కోపపడినేను మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన యీ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలొ యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవ డును చూడడు. అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతాన మునకును ఇచ్చెదనని ప్రమాణముచేసెను.
- Hebrews 3:9–10 హెబ్రీయులకు 3:9–10నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరమువారివలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నా మార్గములను తెలిసికొనలేదు.
- Joshua 14:7–11 యెహోషువ 14:7–11దేశ మును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలోనుండి నన్ను పంపినప్పుడు నేను నలువది ఏండ్లవాడను; ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. నాతోకూడ బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయము లను కరుగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసినీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పు డును స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పి నట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడచిన యీ నలు వది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి యున్నాడు; ఇదిగో నేనిప్పుడు ఎనబదియయిదేండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటివరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచునుండుటకు గాని నాకెప్పటియట్లు బల మున్నది.