Acts · chapter 28 · verse 23
Acts 28:23 in Telugu
అతనికి ఒక దినము నియమించి, అతని బసలోనికి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములోనుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను.
Ataniki oka dinamu niyaminchi, atani basaloniki ataniyoddaku anekulu vachchiri. Udayamunundi saayankaalamuvaraku atadu devuni raajyamunugoorchi poortigaa saakshyamichchuchu, moshe dharmashaastramulonundiyu pravaktalalonundiyu sangatuletti yesunugoorchi vivaramugaa bodhinchuchu vaarini oppinchuchundenu.
Acts 28:23 in English
- King James Version (KJV)
- And when they had appointed him a day, there came many to him into [his] lodging; to whom he expounded and testified the kingdom of God, persuading them concerning Jesus, both out of the law of Moses, and [out of] the prophets, from morning till evening.
- World English Bible (WEB)
- When they had appointed him a day, many people came to him at his lodging. He explained to them, testifying about God’s Kingdom, and persuading them concerning Jesus, both from the law of Moses and from the prophets, from morning until evening.
- American Standard Version (ASV)
- And when they had appointed him a day, they came to him into his lodging in great number; to whom he expounded [the matter], testifying the kingdom of God, and persuading them concerning Jesus, both from the law of Moses and from the prophets, from morning till evening.
- Bible in Basic English (BBE)
- And when a day had been fixed, they came to his house in great numbers; and he gave them teaching, giving witness to the kingdom of God, and having discussions with them about Jesus, from the law of Moses and from the prophets, from morning till evening.
- Darby Translation (DBY)
- And having appointed him a day many came to him to the lodging, to whom he expounded, testifying of the kingdom of God, and persuading them concerning Jesus, both from the law of Moses and the prophets, from early morning to evening.
- Webster's Bible (WBS)
- And when they had appointed him a day, there came many to him into [his] lodging; to whom he expounded and testified the kingdom of God, persuading them concerning Jesus, both out of the law of Moses, and [out of] the prophets, from morning till evening.
- Young's Literal Translation (YLT)
- and having appointed him a day, they came, more of them unto him, to the lodging, to whom he was expounding, testifying fully the reign of God, persuading them also of the things concerning Jesus, both from the law of Moses, and the prophets, from morning till evening,
Read in context
- 21అందుకు వారు యూదయనుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు; ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్నుగూర్చి చెడుసంగతి ఏదియు మాకు తెలియ పరచను లేదు, మరియు ఎవరును చెప్పుకొనను లేదు.
- 22అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీవలన విన గోరుచున్నాము; ఈ మతభేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు ఇంతమట్టుకు మాకు తెలియుననిరి.
- 23అతనికి ఒక దినము నియమించి, అతని బసలోనికి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములోనుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను.
- 24అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి.
- 25వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్లిపోయిరి. అదేదనగా.
Cross references
- Acts 19:8 అపొస్తలుల కార్యములు 19:8తరువాత అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను.
- Acts 17:2–3 అపొస్తలుల కార్యములు 17:2–3గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లిక్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతి దినములు తర్కించుచుండెను.
- Acts 18:28 అపొస్తలుల కార్యములు 18:28యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను.
- Acts 26:22–23 అపొస్తలుల కార్యములు 26:22–23అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటిని; క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక, అల్పు లకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని.
- Luke 24:26–27 లూకా 24:26–27క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.
- Acts 8:35 అపొస్తలుల కార్యములు 8:35అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను.
- Luke 24:44 లూకా 24:44అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను
- Acts 26:6 అపొస్తలుల కార్యములు 26:6ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణనుగూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను.
- Acts 18:4 అపొస్తలుల కార్యములు 18:4అతడు ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను.
- John 4:34 యోహాను 4:34యేసు వారిని చూచినన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.
- Acts 20:9–11 అపొస్తలుల కార్యములు 20:9–11అప్పుడు ఐతుకు అను నొక ¸యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయిన వాడై యెత్తబడెను అంతట పౌలు క్రిందికి వెళ్లి అతనిమీద పడి కౌగిలించుకొనిమీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను. అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, తెల్లవారువరకు విస్తారముగా సంభాషించి బయలు దేరెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- appointed · G5021τάσσω tássō
- him · G846αὐτός autós
- day · G2250ἡμέρα hēméra
- came · G2240ἥκω hḗkō
- many · G4119πλείων pleíōn
- to · G4314πρός prós
- him · G846αὐτός autós
- into · G1519εἰς eis
- lodging · G3578ξενία xenía
- whom · G3739ὅς hós
- expounded · G1620ἐκτίθημι ektíthēmi
- and · G5037τέ té
- testified · G1263διαμαρτύρομαι diamartýromai
- kingdom · G932βασιλεία basileía
- God · G2316θεός theós
- persuading · G3982πείθω peíthō
- them · G846αὐτός autós
- concerning · G4012περί perí
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- both · G5037τέ té
- out · G575ἀπό apó
- law · G3551νόμος nómos
- Moses · G3475Μωσεύς Mōseús
- and · G2532καί kaí
- prophets · G4396προφήτης prophḗtēs
- from · G575ἀπό apó
- morning · G4404πρωΐ prōḯ
- till · G2193ἕως héōs
- evening · G2073ἑσπέρα hespéra