Daniel · chapter 2 · verse 20
Daniel 2:20 in Telugu
ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక.
Etlanagaa devudu jnyaanabalamulu kalavaadu, yugamulannitanu devuni naamamu stutinondunugaaka.
Daniel 2:20 in English
- King James Version (KJV)
- Daniel answered and said, Blessed be the name of God for ever and ever: for wisdom and might are his:
- World English Bible (WEB)
- Daniel answered, “Blessed be the name of God forever and ever; for wisdom and might are his.
- American Standard Version (ASV)
- Daniel answered and said, Blessed be the name of God for ever and ever; for wisdom and might are his.
- Bible in Basic English (BBE)
- And Daniel said in answer, May the name of God be praised for ever and ever: for wisdom and strength are his:
- Darby Translation (DBY)
- Daniel answered and said, Blessed be the name of God for ever and ever; For wisdom and might are his.
- Webster's Bible (WBS)
- Daniel answered and said, Blessed be the name of God for ever and ever: for wisdom and might are his:
- Young's Literal Translation (YLT)
- Daniel hath answered and said, 'Let the name of God be blessed from age even unto age, for wisdom and might — for they are His.
Read in context
- 18తానును తన స్నేహితులును బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడ నశింపకుండునట్లు ఆ కలయొక్క మర్మవిషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను.
- 19అంతట రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దాని యేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను.
- 20ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక.
- 21ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు.
- 22ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగుయొక్క నివాసస్థలము ఆయనయొద్దనున్నది.
Cross references
- Psalm 145:1–2 కీర్తనలు 145:1–2రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.
- Psalm 113:2 కీర్తనలు 113:2ఇది మొదలుకొని యెల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక.
- Job 12:13 యోబు 12:13జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు.
- Revelation 5:12 ప్రకటన 5:12వారువధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.
- Psalm 147:5 కీర్తనలు 147:5మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు.
- Jeremiah 32:19 యిర్మీయా 32:19ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలనుబట్టియు వారి క్రియాఫలమును బట్టియు అందరికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులార చూచుచున్నావు.
- Jude 1:24 యూదా 1:24తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,
- Daniel 2:21–23 దానియేలు 2:21–23ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు. ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగుయొక్క నివాసస్థలము ఆయనయొద్దనున్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకనుగ్రహించి యున్నావు; మేమడిగిన యీ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసియున్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను; ఏలయనగా రాజుయొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరల చెప్పెను.
- Job 12:16–22 యోబు 12:16–22బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున నున్నారు. ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును. రాజుల అధికారమును ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును. యాజకులను వస్త్రహీనులనుగా చేసి వారిని తోడుకొని పోవును స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును. వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయును పెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును. అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును
- Psalm 115:18 కీర్తనలు 115:18మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.
- 1 Chronicles 29:10–12 1 దినవృత్తాంతములు 29:10–12రాజైన దావీదుకూడను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెనుమాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.
- Psalm 103:1–2 కీర్తనలు 103:1–2నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము
Original words (Hebrew)
- Daniel · H1841דָּנִיֵּאל Dânîyêʼl
- answered · H6032עֲנָה ʻănâh
- said · H560אֲמַר ʼămar
- Blessed · H1289בְּרַךְ bᵉrak
- be · H1934הָוָא hâvâʼ
- name · H8036שֻׁם shum
- God · H426אֱלָהּ ʼĕlâhh
- for · H4481מִן min
- ever · H5957עָלַם ʻâlam
- ever · H5705עַד ʻad
- wisdom · H2452חׇכְמָה chokmâh
- might · H1370גְּבוּרָה gᵉbûwrâh
- are · H1932הוּא hûwʼ