Deuteronomy · chapter 1 · verse 16
Deuteronomy 1:16 in Telugu
అప్పుడు నేను మీ న్యాయాధిపతులతోమీ సహోదరుల వ్యాజ్యెములను తీర్చి, ప్రతి మనుష్యుని కిని వాని సహోదరునికిని వానియొద్దనున్న పరదేశికిని న్యాయమునుబట్టి మీరు తీర్పు తీర్చవలెను.
Appudu nenu mee nyaayaadhipatulatomee sahodarula vyaajyemulanu teerchi, prati manushyuni kini vaani sahodarunikini vaaniyoddanunna paradeshikini nyaayamunubatti meeru teerpu teerchavalenu.
Deuteronomy 1:16 in English
- King James Version (KJV)
- And I charged your judges at that time, saying, Hear [the causes] between your brethren, and judge righteously between [every] man and his brother, and the stranger [that is] with him.
- World English Bible (WEB)
- I commanded your judges at that time, saying, “Hear cases between your brothers and judge righteously between a man and his brother, and the foreigner who is living with him.
- American Standard Version (ASV)
- And I charged your judges at that time, saying, Hear [the causes] between your brethren, and judge righteously between a man and his brother, and the sojourner that is with him.
- Bible in Basic English (BBE)
- And at that time I gave orders to your judges, saying, Let all questions between your brothers come before you for hearing, and give decisions uprightly between a man and his brother or one from another nation who is with him.
- Darby Translation (DBY)
- And I commanded your judges at that time, saying, Hear [the causes] between your brethren, and judge righteously between a man and his brother, and him also that sojourneth with him.
- Webster's Bible (WBS)
- And I charged your judges at that time, saying, Hear [the causes] between your brethren, and judge righteously between [every] man and his brother, and the stranger [that is] with him.
- Young's Literal Translation (YLT)
- And I command your judges at that time, saying, Hearkening between your brethren — then ye have judged righteousness between a man, and his brother, and his sojourner;
Read in context
- 14మీరునీవు చెప్పిన మాటచొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి.
- 15కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని, మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యి మందికి ఒకడును, నూరుమందికి ఒకడును ఏబదిమందికి ఒకడును, పదిమందికి ఒకడును వారిని, మీమీద నేను నియమించితిని.
- 16అప్పుడు నేను మీ న్యాయాధిపతులతోమీ సహోదరుల వ్యాజ్యెములను తీర్చి, ప్రతి మనుష్యుని కిని వాని సహోదరునికిని వానియొద్దనున్న పరదేశికిని న్యాయమునుబట్టి మీరు తీర్పు తీర్చవలెను.
- 17తీర్పు తీర్చు నప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్ష పాతములేకుండ వినవలెను; న్యాయపుతీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠినవ్యాజ్యెమును నాయొద్దకు తీసి కొని రావలెను; నేను దానిని విచారించెదనని వారి కాజ్ఞా పించితిని.
- 18మరియు మీరు చేయవలసిన సమస్తకార్యము లను గూర్చి అప్పుడు మీకాజ్ఞాపించితిని.
Cross references
- John 7:24 యోహాను 7:24వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.
- 1 Timothy 5:21 1 తిమోతికి 5:21విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియుచేయక, నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని యెదుటను, క్రీస్తుయేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవ దూతలయెదుటను నీకు ఆనబెట్టుచున్నాను.
- Exodus 23:2–3 నిర్గమకాండము 23:2–3దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పి వేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యెములో సాక్ష్యము పలుకకూడదు; వ్యాజ్యెమాడువాడు బీదవాడైనను వానియెడల పక్షపాతముగా నుండకూడదు.
- Exodus 23:7–9 నిర్గమకాండము 23:7–9అబద్ధమునకు దూరముగానుండుము; నిరప రాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు; నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసి కొనకూడదు; లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాట లకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు; పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు; మీరు ఐగుప్తుదేశములో పరదేశులై యుంటిరిగదా.
- Exodus 22:21 నిర్గమకాండము 22:21పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశ ములో పరదేశులై యుంటిరి గదా.
- 2 Chronicles 19:6–10 2 దినవృత్తాంతములు 19:6–10మీరు యెహోవా నియమమునుబట్టియే గాని మనుష్యుల నియ మమునుబట్టి తీర్పు తీర్చవలసినవారు కారు; ఆయన మీతో కూడ నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు, ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణ యించిన న్యాయమును జరిగించుటకును, సందేహాంశములను పరిష్కరించుటకును, యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరుల యిండ్ల పెద్దలలోను కొందరిని నియమించి వారికీలాగున ఆజ్ఞా పించెనుయెహోవాయందు భయభక్తులు కలిగినవారై, నమ్మకముతోను యథార్థమనస్సుతోను మీరు ప్రవర్తింప వలెను. నరహత్యను గూర్చియు, ధర్మశాస్త్రమును గూర్చియు, ధర్మమును గూర్చియు, కట్టడలను గూర్చియు, న్యాయవిధులను గూర్చియు, ఆయాపట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినేగాని మీరు విమర్శించునప్పుడు, మీమీదికిని మీ సహోదరులమీదికిని కోపము రాకుండునట్లు వారు యెహోవాదృష్టికి ఏ అప రాధమును చేయకుండ వారిని హెచ్చరిక చేయవలెను; మీరాలాగు చేసినయెడల అపరాధులు కాకయుందురు.
- Deuteronomy 16:18–19 ద్వితీయోపదేశకాండము 16:18–19నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న నీ గ్రామము లన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయ కులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పుతీర్చవలెను. నీవు న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు; పక్షపాతము చేయకూడదు; లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్ను లకు గ్రుడ్డితనము కలుగజేయును నీతి మంతుల మాటలకు అపార్థము పుట్టించును.
- Leviticus 24:22 లేవీయకాండము 24:22మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడ నైన యెహోవానని వారితో చెప్పుము అనెను.
- Leviticus 19:15 లేవీయకాండము 19:15అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్ష పాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమునుబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.
- Numbers 27:19 సంఖ్యాకాండము 27:19యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల యెదుట అతనికి ఆజ్ఞ యిమ్ము;
- Psalm 58:1 కీర్తనలు 58:1అధిపతులారా, మీరు నీతి ననుసరించి మాటలాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమునుబట్టి తీర్పు తీర్చు దురా?
- 1 Timothy 6:17 1 తిమోతికి 6:17ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభ వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.