Deuteronomy · chapter 2 · verse 34
Deuteronomy 2:34 in Telugu
ఆ కాల మున అతని సమస్త పురములను పట్టుకొని, ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియులేకుండ నాశనము చేసితివిు.
Aa kaala muna atani samasta puramulanu pattukoni, prati puramunu andali stree purushulanu pillalanu sheshamemiyulekunda naashanamu chesitiviు.
Deuteronomy 2:34 in English
- King James Version (KJV)
- And we took all his cities at that time, and utterly destroyed the men, and the women, and the little ones, of every city, we left none to remain:
- World English Bible (WEB)
- We took all his cities at that time, and utterly destroyed every inhabited city, with the women and the little ones. We left no one remaining.
- American Standard Version (ASV)
- And we took all his cities at that time, and utterly destroyed every inhabited city, with the women and the little ones; we left none remaining:
- Bible in Basic English (BBE)
- At that time we took all his towns, and gave them over to complete destruction, together with men, women, and children; we had no mercy on any:
- Darby Translation (DBY)
- And we took all his cities at that time, and utterly destroyed every city, men, and women, and little ones: we let none escape.
- Webster's Bible (WBS)
- And we took all his cities at that time, and utterly destroyed the men, and the women, and the little ones of every city, we left none to remain.
- Young's Literal Translation (YLT)
- and we capture all his cities at that time, and devote the whole city, men, and the women, and the infants — we have not left a remnant;
Read in context
- 32సీహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయుటకై మనకు ఎదు రుగా బయలుదేరి రాగా
- 33మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి
- 34ఆ కాల మున అతని సమస్త పురములను పట్టుకొని, ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియులేకుండ నాశనము చేసితివిు.
- 35పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి.
- 36అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ యేటియొద్దనున్న పురము మొదలుకొని గిలాదువరకు మనకు అసాధ్యమైన నగర మొకటియు లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను.
Cross references
- 1 Samuel 15:3 1 సమూయేలు 15:3కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలే కీయులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱెలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయు లను నిర్మూలము చేయుమని చెప్పెను.
- Deuteronomy 7:2 ద్వితీయోపదేశకాండము 7:2నీ దేవుడైన యెహోవా వారిని నీకప్ప గించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింప కూడదు,
- Deuteronomy 3:6 ద్వితీయోపదేశకాండము 3:6మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితివిు; ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితివిు;
- Deuteronomy 7:26 ద్వితీయోపదేశకాండము 7:26దానివలె నీవు శాపగ్రస్తుడవు కాకుండునట్లు నీవు హేయమైన దాని నీయింటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దానియందు బొత్తిగా అసహ్యపడవలెను.
- Deuteronomy 20:16–18 ద్వితీయోపదేశకాండము 20:16–18అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్య ముగా నీకిచ్చుచున్న యీ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రదుకనియ్యకూడదు. వీరు, అనగా హీత్తీ యులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివీ్వ యులు యెబూసీయులనువారు తమ తమ దేవతల విష యమై చేసిన సమస్త హేయకృత్యములరీతిగా మీరు చేసి, నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయు టకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయ వలెను.
- Joshua 7:11 యెహోషువ 7:11ఇశ్రాయేలీ యులు పాపము చేసియున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసికొని, దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని యున్నారు.
- Leviticus 27:28–29 లేవీయకాండము 27:28–29అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్య మైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేని నైనను ఒకడు యెహోవాకు ప్రతిష్టించినయెడల ప్రతి ష్ఠించినదానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు, ప్రతి ష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేని నైనను విడిపింపక హతము చేయవలెను.
- 1 Samuel 15:8–9 1 సమూయేలు 15:8–9అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులనందరిని కత్తిచేత నిర్మూలము చేసెను సౌలును జనులును కూడి అగగును, గొఱ్ఱెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొఱ్ఱెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి, పనికిరాని నీచపశువులన్నిటిని నిర్మూలముచేసిరి.
- Numbers 21:2–3 సంఖ్యాకాండము 21:2–3ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని నీవు మా చేతికి ఈ జన మును బొత్తిగా అప్పగించినయెడల మేము వారి పట్టణము లను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను.
- Joshua 11:14 యెహోషువ 11:14ఆ పట్టణ ముల సంబంధమైన కొల్లసొమ్మును పశువులను ఇశ్రాయేలీ యులు దోచుకొనిరి. నరులలో ఒకనిని విడువకుండ అందరిని నశింపజేయువరకు కత్తివాతను హతము చేయుచు వచ్చిరి.
- Joshua 8:25–26 యెహోషువ 8:25–26ఆ దినమున పడిన స్త్రీ పురుషు లందరు పండ్రెండు వేలమంది. యెహోషువ హాయి నివాసులనందరిని నిర్మూలము చేయువరకు ఈటెను పట్టు కొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.
- Joshua 9:24 యెహోషువ 9:24అందుకు వారు యెహోషువను చూచినీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి, మీ యెదుట నిలువకుండ ఈ దేశనివాసులనందరిని నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించెనని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయములో నీవలన మిక్కిలి భయపడి యీలాగు చేసితివిు.