Ecclesiastes · chapter 4 · verse 14
Ecclesiastes 4:14 in Telugu
అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలోనుండి బయలువెళ్లును.
Attivaadu tana deshamandu beedavaadugaa puttinanu pattaabhishekamu nondutaku cherasaalalonundi bayaluvellunu.
Ecclesiastes 4:14 in English
- King James Version (KJV)
- For out of prison he cometh to reign; whereas also [he that is] born in his kingdom becometh poor.
- World English Bible (WEB)
- For out of prison he came out to be king; yes, even in his kingdom he was born poor.
- American Standard Version (ASV)
- For out of prison he came forth to be king; yea, even in his kingdom he was born poor.
- Bible in Basic English (BBE)
- Because out of a prison the young man comes to be king, though by birth he was only a poor man in the kingdom.
- Darby Translation (DBY)
- For out of the prison-house he came forth to reign, although he was born poor in his kingdom.
- Webster's Bible (WBS)
- For out of prison he cometh to reign; whereas also [he that is] born in his kingdom becometh poor.
- Young's Literal Translation (YLT)
- For from a house of prisoners he hath come out to reign, for even in his own kingdom he hath been poor.
Read in context
- 12ఒంటరి యగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?
- 13మూఢత్వముచేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజుకంటె బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్న వాడే శ్రేష్ఠుడు.
- 14అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలోనుండి బయలువెళ్లును.
- 15సూర్యునిక్రింద సంచరించు సజీవు లందరు గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్న వాని పక్షమున నుందురని నేను తెలిసికొంటిని.
- 16అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు, అయినను తరువాత రాబోవువారు వీనియందు ఇష్టపడరు. నిజముగా ఇదియు వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే.
Cross references
- Genesis 41:14 ఆదికాండము 41:14ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలోనుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరోయొద్దకు వచ్చెను.
- Psalm 113:7–8 కీర్తనలు 113:7–8ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు
- Job 5:11 యోబు 5:11అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును.
- Lamentations 4:20 విలాపవాక్యములు 4:20మాకు నాసికారంధ్రముల ఊపిరివంటివాడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను.
- Genesis 41:33–44 ఆదికాండము 41:33–44కాబట్టి ఫరో వివేక జ్ఞానములుగల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశముమీద అతని నియమింపవలెను. ఫరో అట్లు చేసి యీ దేశముపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను అయిదవ భాగము తీసికొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహార మంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరవుచేత ఈ దేశము నశించిపోకుండ ఆ ఆహారము ఐగుప్తుదేశములో రాబోవు కరవు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరోదృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైయుండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని యనెను. మరియు ఫరో - దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు. నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులై యుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో - చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి యున్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతని నెక్కించెను. అప్పుడు - వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను. మరియు ఫరో యోసేపుతో - ఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను.
- 2 Kings 25:27–30 2 రాజులు 25:27–30యూదారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన ముప్పదియేడవ సంవత్సరమున పండ్రెండవ నెల యిరువది యేడవ దినమున బబులోనురాజైన ఎవీల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సర మందు బందీగృహములోనుండి యూదారాజైన యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాటలాడి, అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠములకంటె ఎత్తుచేసెను. కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్ర ములను ధరించుకొని తాను బ్రదికిన దినములన్నియు రాజు సన్నిధిని భోజనముచేయుచు వచ్చెను. మరియు అతని బత్తెము ఏనాటికి ఆనాడు రాజుచేత నిర్ణయింపబడినదై అతడు బ్రదికినన్నాళ్లు ఆ చొప్పున అతని కియ్యబడు చుండెను.
- Daniel 4:31 దానియేలు 4:31రాజు నోట ఈ మాట యుండగా ఆకాశమునుండి యొక శబ్దము వచ్చెను, ఏదనగా రాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను.
- 2 Kings 24:12 2 రాజులు 24:12అప్పుడు యూదారాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులును అతని క్రింది అధిపతు లును అతని పరివారమును బయలువెళ్లి బబులోనురాజునొద్దకు రాగా బబులోనురాజు యేలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనెను.
- 2 Kings 25:7 2 రాజులు 25:7సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి యిత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసికొనిపోయిరి.
- 2 Kings 24:6 2 రాజులు 24:6యెహోయాకీము తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయెను.
- 1 Kings 14:26–27 1 రాజులు 14:26–27యెహోవా మందిరపు ఖజనాలోని పదార్థములను, రాజనగరుయొక్క ఖజనాలోని పదార్థములను, ఎత్తికొని పోయెను, అతడు సమస్తమును ఎత్తికొని పోయెను; సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తికొని పోయెను. రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి, రాజనగరు ద్వార పాలకులైన తన దేహసంరక్షకుల అధిపతుల వశము చేసెను.
- 2 Kings 23:31–34 2 రాజులు 23:31–34యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె యగు హమూటలు. ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండ ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధక ములలో ఉంచి, దేశముమీద ఏబది మణుగుల వెండిని, రెండు మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారుపేరుపెట్టి యెహోయాహాజు ఐగుప్తుదేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను.