Psalms · chapter 113 · verse 7
Psalm 113:7 in Telugu
ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై
Pradhaanulato tana prajala pradhaanulato vaarini koorchundabettutakai
Psalm 113:7 in English
- King James Version (KJV)
- He raiseth up the poor out of the dust, [and] lifteth the needy out of the dunghill;
- World English Bible (WEB)
- He raises up the poor out of the dust, and lifts up the needy from the ash heap,
- American Standard Version (ASV)
- He raiseth up the poor out of the dust, And lifteth up the needy from the dunghill;
- Bible in Basic English (BBE)
- He takes the poor man out of the dust, lifting him up from his low position;
- Darby Translation (DBY)
- He raiseth up the poor out of the dust; from the dung-hill he lifteth up the needy,
- Webster's Bible (WBS)
- He raiseth the poor out of the dust, [and] lifteth the needy out of the dunghill;
- Young's Literal Translation (YLT)
- He is raising up from the dust the poor, From a dunghill He exalteth the needy.
Read in context
- 5ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు?
- 6ఆయన భూమ్యాకాశములను వంగిచూడనను గ్రహించు చున్నాడు.
- 7ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై
- 8ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు
- 9ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి.
Cross references
- 1 Samuel 2:7–8 1 సమూయేలు 2:7–8యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్ప మీది నుండి లేవనెత్తు వాడు ఆయనే. భూమియొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు.
- Luke 1:52–53 లూకా 1:52–53సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.
- Psalm 107:41 కీర్తనలు 107:41అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలె వృద్ధిచేసెను.
- Job 5:11 యోబు 5:11అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును.
- 2 Samuel 7:8–9 2 సమూయేలు 7:8–9కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుముసైన్యముల కధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగాగొఱ్ఱెల కాపులోనున్న నిన్ను గొఱ్ఱెలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించి తిని. నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, లోకము లోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి యున్నాను.
- Ezekiel 17:24 యెహెజ్కేలు 17:24దాని కొమ్మల నీడను అవి దాగును; మరియు యెహో వానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవు నట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమియందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాని నెరవేర్చెదను.
- Daniel 12:2–3 దానియేలు 12:2–3మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభ వించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.
- Psalm 75:6–7 కీర్తనలు 75:6–7తూర్పునుండియైనను పడమటినుండియైనను అరణ్యమునుండియైనను హెచ్చుకలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును
- Job 5:15–16 యోబు 5:15–16బలాఢ్యుల నోటి ఖడ్గమునుండి, వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కావున బీదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసికొనును.
- Ezekiel 21:26–27 యెహెజ్కేలు 21:26–27ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతలాటమును తీసివేయుము కిరీట మును ఎత్తుము, ఇది యికను ఇట్లుండదు. ఇకమీదట నీచుని ఘనునిగాను ఘనుని నీచునిగాను చేయుము. నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడ ద్రోయుదును; దాని స్వాస్థ్యకర్త వచ్చువరకు అదియు నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను.
- Job 36:6–7 యోబు 36:6–7భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును. నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనముమీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు.
- 1 Peter 3:21–22 1 పేతురు 3:21–22దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్లి దూతలమీదను అధికారుల మీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.