1 Chronicles · chapter 29 · verse 24
1 Chronicles 29:24 in Telugu
అధిపతులందరును యోధులందరును రాజైన దావీదు కుమారులందరును రాజైన సొలొమోనునకు లోబడిరి.
Adhipatulandarunu yodhulandarunu raajaina daaveedu kumaarulandarunu raajaina solomonunaku lobadiri.
1 Chronicles 29:24 in English
- King James Version (KJV)
- And all the princes, and the mighty men, and all the sons likewise of king David, submitted themselves unto Solomon the king.
- World English Bible (WEB)
- All the princes, the mighty men, and also all of the sons of King David submitted themselves to Solomon the king.
- American Standard Version (ASV)
- And all the princes, and the mighty men, and all the sons likewise of king David, submitted themselves unto Solomon the king.
- Bible in Basic English (BBE)
- And all the chiefs and the men of war and all the sons of King David put themselves under the authority of Solomon the king.
- Darby Translation (DBY)
- And all the princes, and the mighty men, and all the sons likewise of king David, submitted themselves to Solomon the king.
- Webster's Bible (WBS)
- And all the princes, and the mighty men, and all the sons likewise of king David, submitted themselves to Solomon the king.
- Young's Literal Translation (YLT)
- and all the heads, and the mighty men, and also all the sons of king David have given a hand under Solomon the king;
Read in context
- 22ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకముచేసి, యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి.
- 23అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదునకు మారుగా యెహోవా సింహా సనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరును అతని యాజ్ఞకు బద్ధులై యుండిరి.
- 24అధిపతులందరును యోధులందరును రాజైన దావీదు కుమారులందరును రాజైన సొలొమోనునకు లోబడిరి.
- 25యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి యెదు టను బహుగా ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీ యులను ఏలిన యే రాజునకైనను కలుగని రాజ్యప్రభావమును అతని కనుగ్రహించెను.
- 26యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజైయుండెను.
Cross references
- 1 Chronicles 28:21 1 దినవృత్తాంతములు 28:21దేవుని మందిర సేవయంతటికిని యాజకులును లేవీయులును వంతులప్రకా రము ఏర్పాటైరి; నీ యాజ్ఞకు బద్ధులైయుండి యీ పని యంతటిని నెరవేర్చుటకై ఆ యా పనులయందు ప్రవీణులైన వారును మనఃపూర్వకముగా పనిచేయువారును అధి పతులును జనులందరును నీకు సహాయులగుదురు.
- Ezekiel 17:18 యెహెజ్కేలు 17:18తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను, తన చెయ్యి యిచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే, అతడు ఎంతమాత్రమును తప్పించుకొనడు.
- 1 Chronicles 2:3–9 1 దినవృత్తాంతములు 2:3–9యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు. పెరెసు కుమారులు హెస్రోను హామూలు. జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార. కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను. ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను. హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.
- 1 Kings 1:50–53 1 రాజులు 1:50–53అదోనీయా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. అదోనీయా రాజైన సొలొ మోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనిరాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండ ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా సొలొమోను ఈలాగు సెలవిచ్చెను అతడు తన్ను యోగ్యునిగా అగుపరచుకొనిన యెడల అతని తల వెండ్రుకలలో ఒకటైనను క్రిందపడదు గాని అతనియందు దౌష్ట్యము కనబడిన యెడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠమునొద్దనుండి అతని పిలువనంపించెను; అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితోనీ యింటికి పొమ్మని సెలవిచ్చెను.
- Genesis 47:29 ఆదికాండము 47:29ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి - నా యెడల నీకు కటాక్షమున్నయెడల దయచేసి నీ చెయ్యి నా తొడక్రింద ఉంచి నా యెడల దయను నమ్మకమును కనుపరచుము; ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము.
- 2 Chronicles 30:8 2 దినవృత్తాంతములు 30:8మీ పితరులవలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతముగా పరిశుద్ధ పరచిన ఆయన పరిశుద్ధమందిరములో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీదినుండి తొలగి పోవునట్లు ఆయనను సేవించుడి.
- 1 Chronicles 22:17 1 దినవృత్తాంతములు 22:17మరియు తన కుమారుడైన సొలొమోనునకు సహాయము చేయవలెనని దావీదు ఇశ్రాయేలీయుల యధిపతుల కందరికిని ఆజ్ఞాపించెను.
- 1 Kings 2:24–25 1 రాజులు 2:24–25నన్ను స్థిరపరచి, నా తండ్రి సింహాసనముమీద నన్ను ఆసీనునిగా చేసి, తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యెహోవా జీవముతోడు, అదోనీయా యీ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారు డైన బెనాయాను పంపగా ఇతడు అదోనీయా మీద పడినందున అతడు చనిపోయెను.
- Genesis 24:2 ఆదికాండము 24:2అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము;