Ecclesiastes · chapter 8 · verse 5
Ecclesiastes 8:5 in Telugu
ధర్మము నాచరించువారికి కీడేమియు సంభవింపదు; సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలిసికొందురు.
Dharmamu naacharinchuvaariki keedemiyu sambhavimpadu; samayamu vachchunaniyu nyaayamu jarugunaniyu jnyaanulu manassuna telisikonduru.
Ecclesiastes 8:5 in English
- King James Version (KJV)
- Whoso keepeth the commandment shall feel no evil thing: and a wise man’s heart discerneth both time and judgment.
- World English Bible (WEB)
- Whoever keeps the commandment shall not come to harm, and his wise heart will know the time and procedure.
- American Standard Version (ASV)
- Whoso keepeth the commandment shall know no evil thing; and a wise man’s heart discerneth time and judgment:
- Bible in Basic English (BBE)
- Whoever keeps the law will come to no evil: and a wise man's heart has knowledge of time and of decision.
- Darby Translation (DBY)
- Whoso keepeth the commandment shall know no evil thing; and a wise man's heart knoweth time and manner.
- Webster's Bible (WBS)
- He who keepeth the commandment shall feel no evil thing: and a wise man's heart discerneth both time and judgment.
- Young's Literal Translation (YLT)
- Whoso is keeping a command knoweth no evil thing, and time and judgment the heart of the wise knoweth.
Read in context
- 3రాజుల సముఖమునుండి అనాలోచనగా వెళ్లకుము; వారు తాము కోరినదెల్ల నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలుపుచ్చుకొనకుము.
- 4రాజుల ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగల వాడెవడు?
- 5ధర్మము నాచరించువారికి కీడేమియు సంభవింపదు; సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలిసికొందురు.
- 6ప్రతి సంగ తిని విమర్శించు సమయమును ఏర్పడియున్నది; లేనియెడల మనుష్యులుచేయు కీడు బహు భారమగును.
- 7సంభవింప బోవునది నరులకు తెలియదు; అది ఏలాగు సంభవించునో వారికి తెలియజేయువారెవరు?
Cross references
- Hebrews 5:14 హెబ్రీయులకు 5:14వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును.
- 1 Peter 3:13–14 1 పేతురు 3:13–14మీరు మంచి విషయములో ఆసక్తిగలవారైతే మీకు హానిచేయువాడెవడు? మీరొకవేళ నీతినిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి;
- Philippians 1:9–10 ఫిలిప్పీయులకు 1:9–10మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసు క్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనిన
- Romans 13:5–7 రోమీయులకు 13:5–7కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు. ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.
- 1 Chronicles 12:32 1 దినవృత్తాంతములు 12:32ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానముకలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు రెండువందలు; వీరి గోత్రపు వారందరును వీరి యాజ్ఞకు బద్ధులైయుండిరి.
- Acts 4:19 అపొస్తలుల కార్యములు 4:19అందుకుపేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;
- Luke 20:25 లూకా 20:25అందుకాయన ఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను.
- Acts 5:29 అపొస్తలుల కార్యములు 5:29అందుకు పేతురును అపొస్తలులునుమనుష్యలకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.
- 1 Corinthians 2:14–15 1 కొరింథీయులకు 2:14–15ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మసంబంధియైనవాడు అన్ని టిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింప బడడు.
- Ecclesiastes 10:2 ప్రసంగి 10:2జ్ఞానియొక్క హృదయము అతని కుడిచేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును.
- Exodus 1:17 నిర్గమకాండము 1:17అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుకనియ్యగా
- Hosea 5:11 హోషేయ 5:11ఎఫ్రాయిమీయులు మానవపద్ధతిని బట్టి ప్రవర్తింప గోరు వారు; వారికధికశ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింసనొందుదురు బాధింపబడుదురు.