Exodus · chapter 16 · verse 28
Exodus 16:28 in Telugu
అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను - మీరు ఎన్నాళ్లవరకు నా ఆజ్ఞలను నా ధర్మ శాస్త్రమును అనుసరించి నడువనొల్లరు?
Anduku yehovaa mosheto itlanenu - meeru ennaallavaraku naa aajnyalanu naa dharma shaastramunu anusarinchi naduvanollaru?
Exodus 16:28 in English
- King James Version (KJV)
- And the LORD said unto Moses, How long refuse ye to keep my commandments and my laws?
- World English Bible (WEB)
- The LORD said to Moses, “How long do you refuse to keep my commandments and my laws?
- American Standard Version (ASV)
- And Jehovah said unto Moses, How long refuse ye to keep my commandments and my laws?
- Bible in Basic English (BBE)
- And the Lord said to Moses, How long will you go against my orders and my laws?
- Darby Translation (DBY)
- And Jehovah said to Moses, How long do ye refuse to keep my commandments and my laws?
- Webster's Bible (WBS)
- And the LORD said to Moses, How long refuse ye to keep my commandments and my laws?
- Young's Literal Translation (YLT)
- And Jehovah saith unto Moses, 'How long have ye refused to keep My commands, and My laws?
Read in context
- 26ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను.
- 27అట్లు జరిగెను; ప్రజలలో కొందరు ఏడవ దినమున దాని కూర్చుకొన వెళ్లగా వారికేమియు దొరకక పోయెను.
- 28అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను - మీరు ఎన్నాళ్లవరకు నా ఆజ్ఞలను నా ధర్మ శాస్త్రమును అనుసరించి నడువనొల్లరు?
- 29చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీ కనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి యుండవలెను. ఏడవ దినమున ఎవడును తన చోటనుండి బయలు వెళ్లకూడదనెను.
- 30కాబట్టి యేడవ దినమున ప్రజలు విశ్రమించిరి.
Cross references
- Psalm 78:10 కీర్తనలు 78:10వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లకపోయిరి
- Psalm 106:13 కీర్తనలు 106:13అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి.
- 2 Kings 17:14 2 రాజులు 17:14వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి.
- Ezekiel 20:13 యెహెజ్కేలు 20:13అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుసరింపక, తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా, అరణ్య మందు నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి వారిని నిర్మూ లము చేయుదునను కొంటిని.
- Psalm 78:22 కీర్తనలు 78:22వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణయందు నమ్మిక యుంచలేదు.
- Numbers 14:11 సంఖ్యాకాండము 14:11యెహోవాఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్లవరకు నేను వారి మధ్యను చేసిన సూచకక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక యుందురు?
- Exodus 10:3 నిర్గమకాండము 10:3కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి, అతనిని చూచి యీలాగు చెప్పిరి - హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా - నీవు ఎన్నాళ్లవరకు నాకు లొంగనొల్లక యుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.
- Isaiah 7:13 యెషయా 7:13అతడుఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా, వినుడి; మనుష్యులను విసికించుట చాలదను కొని నా దేవుని కూడ విసికింతురా?
- Mark 9:19 మార్కు 9:19అందుకాయన విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పగా
- Jeremiah 9:6 యిర్మీయా 9:6నీ నివాసస్థలము కాపట్యము మధ్యనే యున్నది, వారు కపటులై నన్ను తెలిసికొననొల్లకున్నారు; ఇదే యెహోవా వాక్కు.
- Psalm 81:13–14 కీర్తనలు 81:13–14అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంత మేలు! అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగ ద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును.
- Numbers 20:12 సంఖ్యాకాండము 20:12అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను.