Exodus · chapter 40 · verse 12
Exodus 40:12 in Telugu
మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొనివచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి
Mariyu neevu aharonunu atani kumaarulanu pratyakshapu gudaaramu yokka dvaaramunoddaku todukonivachchi vaarini neellato snaanamu cheyinchi
Exodus 40:12 in English
- King James Version (KJV)
- And thou shalt bring Aaron and his sons unto the door of the tabernacle of the congregation, and wash them with water.
- World English Bible (WEB)
- “You shall bring Aaron and his sons to the door of the Tent of Meeting, and shall wash them with water.
- American Standard Version (ASV)
- And thou shalt bring Aaron and his sons unto the door of the tent of meeting, and shalt wash them with water.
- Bible in Basic English (BBE)
- Then let Aaron and his sons come to the door of the Tent of meeting; and after washing them with water,
- Darby Translation (DBY)
- And thou shalt bring Aaron and his sons near, at the entrance of the tent of meeting, and bathe them with water.
- Webster's Bible (WBS)
- And thou shalt bring Aaron and his sons to the door of the tabernacle of the congregation, and wash them with water.
- Young's Literal Translation (YLT)
- 'And thou hast brought near Aaron and his sons unto the opening of the tent of meeting, and hast bathed them with water;
Read in context
- 10దహన బలిపీఠమునకు అభిషేకముచేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతిపరిశుద్ధ మగును.
- 11ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను.
- 12మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొనివచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి
- 13అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకముచేసి అతని ప్రతిష్ఠింపవలెను.
- 14మరియు నీవు అతని కుమారులను తోడుకొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి
Cross references
- Leviticus 8:1–13 లేవీయకాండము 8:1–13మరియు యెహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేకతైలమును పాప పరిహారార్థబలిరూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసికొని ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును సమ కూర్చుమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా మోషే సమాజ ముతోచేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టీని కట్టి నిలువుటంగీని, ఏఫోదునువేసి ఏఫోదుయొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి, అతనికి పతకమువేసి ఆ పతకములో ఊరీము తుమీ్మమను వాటిని ఉంచి అతని తలమీద పాగాను పెట్టి, ఆ పాగామీదను అతని నొసట పరిశుద్ధకిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేకతైలమును తీసికొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము ఏడుమారులు బలిపీఠముమీద ప్రోక్షించి, బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభి షేకించెను. మరియు అతడు అభిషేకతైలములో కొంచెము అహరోను తలమీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసి కొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళ్లాయిలను పెట్టెను.
- Leviticus 9:1–24 లేవీయకాండము 9:1–24ఎనిమిదవదినమున మోషే అహరోనును అతని కుమారు లను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనెనునీవు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను, దహనబలిగా నిర్దోషమైన యొక పొట్టే లును యెహోవా సన్నిధికి తీసికొని రమ్ము. మరియు నీవు ఇశ్రాయేలీయులతోమీరు యెహోవా సన్నిధిని బలి నర్పించునట్లు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన మేక పిల్లను, దహనబలిగా నిర్దోషమైన యేడాది దూడను గొఱ్ఱెపిల్లను సమాధానబలిగా కోడెను పొట్టేలును నూనె కలిపిన నైవేద్యమును తీసికొని రండి; నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము. మోషే ఆజ్ఞాపించినవాటిని వారు ప్రత్యక్షపు గుడారము నెదుటికి తీసికొనివచ్చిరి. సమాజ మంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా మోషేమీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞా పించినది ఇదే; అట్లు చేయుడి. అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను. మరియు మోషే అహరోనుతో ఇట్లనెనునీవు బలిపీఠమునొద్దకు వెళ్లి పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పించి నీ నిమిత్త మును ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి ప్రజల కొరకు అర్పణము చేసి, యెహోవా ఆజ్ఞాపించి నట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కాబట్టి అహ రోను బలిపీఠము దగ్గరకు వెళ్లి తనకొరకు పాపపరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనియొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ములమీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను. దాని క్రొవ్వును మూత్రగ్రంథులను కాలేజముమీది వపను బలి పీఠముమీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. దాని మాంసమును చర్మమును పాళెము వెలుపల అగ్నితో కాల్చివేసెను. అప్పుడతడు దహనబలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తము నప్పగింపగా అతడు బలిపీఠముచుట్టు దానిని ప్రోక్షించెను. మరియు వారు దహన బలిపశువుయొక్క తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలి పీఠముమీద వాటిని దహించెను. అతడు దాని ఆంత్రము లను కాళ్లను కడిగి బలిపీఠముమీదనున్న దహనబలి ద్రవ్యముపైని దహించెను. అతడు ప్రజల అర్పణమును తీసికొని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థబలియగు మేకను తీసికొని వధించి మొదటి దానివలె దీనిని పాప పరిహారార్థబలిగా అర్పించెను. అప్పుడతడు దహనబలి పశువును తీసికొని విధి చొప్పున దాని నర్పించెను. అప్పు డతడు నైవేద్యమును తెచ్చి దానిలోనుండి చేరెడు తీసి ప్రాతఃకాలమందు చేసిన దహనబలిగాక బలిపీఠముమీద తీసిన దానిని దహించెను. మరియు మోషే ప్రజలు అర్పించు సమాధానబలిరూపమైన కోడెదూడను పొట్టే లును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టు దానిని ప్రోక్షించెను. మరియు వారు ఆ దూడ క్రొవ్వును మేకక్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును మూత్ర గ్రంథులను కాలేజముమీది వపను అప్పగించిరి. బోరలమీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహించెను. బోరలను కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణ ముగా అహరోను అల్లాడించెను అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అహరోను పాపపరిహారార్థబలిని దహనబలిని సమాధానబలిని అర్పించి, ప్రజలవైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడా రములోనికి పోయి వెలుపలికివచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను. యెహోవా సన్నిధినుండి అగ్ని బయలు వెళ్లి బలిపీఠము మీద నున్న దహనబలిద్రవ్యమును క్రొవ్వును కాల్చి వేసెను; ప్రజలందరు దానిని చూచి ఉత్సాహధ్వనిచేసి సాగిలపడిరి.
- Exodus 29:1–35 నిర్గమకాండము 29:1–35వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించు టకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడెదూడను కళంకములేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసి కొనుము. గోధుమపిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసికొనిరావలెను. మరియు నీవు అహరోనును అతని కుమా రులను ప్రత్యక్షపు గుడార ముయొక్క ద్వారము దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసికొని చొక్కాయిని ఏఫోదు నిలువుటంగిని ఏఫోదును పతక మును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తలమీద పాగాను పెట్టి ఆ పాగామీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసికొని అతని తలమీద పోసి అతని నభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టినికట్టి వారికి కుళ్లాయిలను వేయింపవలెను; నిత్యమైన కట్టడనుబట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను ఆలాగున ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులును కోడె తలమీద తమ చేతుల నుంచగా ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ములమీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపుటడుగున పోయవలెను. మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వం తటిని కాలేజముమీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటిమీది క్రొవ్వును నీవు తీసి బలిపీఠముమీద దహింపవలెను. ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాపపరిహారార్థమైన బలి. నీవు ఆపొట్టేళ్లలో ఒకదాని తీసికొనవలెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠముచుట్టు దాని ప్రోక్షింపవలెను. అంతట నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయవములతోను తలతోను చేర్చి బలిపీఠముమీద ఆ పొట్టేలంతయు దహింపవలెను; అది యెహోవాకు దహనబలి, యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. మరియు నీవు రెండవ పొట్టేలును తీసికొనవలెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి, ఆహరోను కుడిచెవి కొనమీదను అతని కుమారుల కుడి చెవుల కొనమీదను, వారి కుడిచేతి బొట్టన వ్రేళ్లమీదను, వారి కుడికాలి బొట్టనవ్రేళ్లమీదను చమిరి బలిపీఠముమీద చుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోనుమీదను, అతని వస్త్రముల మీదను, అతనితోనున్న అతని కుమారులమీదను, అతని కుమారుల వస్త్రములమీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములును అతనితోనున్న అతని కుమారులును అతని కుమారుల వస్త్రములును ప్రతిష్ఠితము లగును. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును కాలేజముమీది వపను రెండు మూత్రగ్రంథులను వాటిమీది క్రొవ్వును కుడి జబ్బను ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన యొక భక్ష్యమును యెహోవా యెదుటనున్న పొంగనివాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసికొని అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోను వాటినన్నిటిని ఉంచి, అల్లాడింపబడు నైవే ద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసికొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠముమీద దహింపవలెను. అది యెహోవాకు హోమము. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలునుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింప వలెను; అది నీ వంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను. అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీయులనుండి అహ రోనుకును అతని కుమారులకు నగును. అది ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలోనుండి తాము చేసిన ప్రతిష్ఠార్పణ, అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్ఠార్పణగా నుండును. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములును అతని తరువాత అతని కుమారులవగును; వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధస్థలములో సేవచేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడు ఏడు దినములు వాటిని వేసికొనవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొని పరి శుద్ధస్థలములో దాని మాంసమును వండవలెను. అహరోనును అతని కుమారులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారముదగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను. వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటివలన ప్రాయశ్చిత్తము చేయబడెనో వాటిని వారు తినవలెను; అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టె లలో నేమి కొంచెమైనను ఉదయమువరకు మిగిలి యుండిన యెడల మిగిలినది అగ్ని చేత దహింపవ లెను; అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు. నేను నీ కాజ్ఞాపించిన వాటన్నిటినిబట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. ఏడు దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను.
- Isaiah 61:1–3 యెషయా 61:1–3ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.
- Galatians 4:4 గలతీయులకు 4:4అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,
- Matthew 3:16 మత్తయి 3:16యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.
- Romans 8:3 రోమీయులకు 8:3శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము
- Isaiah 11:1–5 యెషయా 11:1–5యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.
- John 3:34 యోహాను 3:34ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.
- Luke 1:35 లూకా 1:35దూతపరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.