Ezekiel · chapter 1 · verse 6
Ezekiel 1:6 in Telugu
ఒక్కొక్క దానికి నాలుగు ముఖములును నాలుగు రెక్కలును గలవు.
Okkokka daaniki naalugu mukhamulunu naalugu rekkalunu galavu.
Ezekiel 1:6 in English
- King James Version (KJV)
- And every one had four faces, and every one had four wings.
- World English Bible (WEB)
- Everyone had four faces, and each one of them had four wings.
- American Standard Version (ASV)
- and every one had four faces, and every one of them had four wings.
- Bible in Basic English (BBE)
- And every one had four faces, and every one of them had four wings.
- Darby Translation (DBY)
- And every one had four faces, and every one of them had four wings.
- Webster's Bible (WBS)
- And every one had four faces, and every one had four wings.
- Young's Literal Translation (YLT)
- and four faces [are] to each, and four wings [are] to each of them,
Read in context
- 4నేను చూడగా ఉత్తర దిక్కునుండి తుపాను వచ్చుచుండెను; మరియు గొప్ప మేఘమును గోళమువలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను, కాంతిదానిచుట్టు ఆవరించియుండెను; ఆ అగ్నిలోనుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజివంటి దొకటి కనబడెను.
- 5దానిలోనుండి నాలుగు జీవుల రూపములుగల యొకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది.
- 6ఒక్కొక్క దానికి నాలుగు ముఖములును నాలుగు రెక్కలును గలవు.
- 7వాటి కాళ్లు చక్కగా నిలువబడినవి, వాటి అరకాళ్లు పెయ్యకాళ్లవలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడివలె ఉండెను.
- 8వాటి నాలుగు ప్రక్కలరెక్కల క్రింద మానవ హస్తములవంటి హస్తములుండెను, నాలుగింటికిని ముఖములును రెక్కలును ఉండెను.
Cross references
- Ezekiel 10:14 యెహెజ్కేలు 10:14కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖము లుండెను; మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము.
- Exodus 25:20 నిర్గమకాండము 25:20ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణా పీఠముతట్టు నుండవలెను. నీవు ఆ కరుణా పీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచ వలెను.
- 1 Kings 6:24–27 1 రాజులు 6:24–27ఒక్కొక్క కెరూబునకు అయిదేసి మూరల పొడవుగల రెక్కలుండెను; ఒక రెక్క చివర మొదలు కొని రెండవ రెక్క చివరమట్టుకు పది మూరలు పొడవు. రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి యుండెను. ఒక కెరూబు పది మూరల యెత్తు రెండవ కెరూబు దానివలెనే యుండెను. అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని యొకదాని రెక్క యివతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటి యుండెను; గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని యుండెను.
- Revelation 4:7–8 ప్రకటన 4:7–8మొదటి జీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది;మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది. ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి - భూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును
- Ezekiel 1:15 యెహెజ్కేలు 1:15ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ నాలుగింటి యెదుట ముఖముల ప్రక్కను చక్రమువంటిదొకటి కనబడెను.
- Ezekiel 10:21–22 యెహెజ్కేలు 10:21–22ఒక్కొకదానికి నాలుగేసి ముఖములును నాలుగేసి రెక్క లును ఉండెను. మరియు ఒక్కొకదానికి రెక్కరెక్క క్రిందను మానవహస్తము వంటిది ఒకటి కనబడెను. మరియు వాటి ముఖరూపములు కెబారు నదిదగ్గర నాకు కనబడిన ముఖరూపములవలె ఉండెను; అవియు వాటి రూపములును అదేవిధముగా ఉండెను; ఇవియన్నియు ఆయా ముఖములవైపుగా జరుగుచుండెను.
- Isaiah 6:2 యెషయా 6:2ఆయనకు పైగా సెరా పులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.
- Ezekiel 1:8–11 యెహెజ్కేలు 1:8–11వాటి నాలుగు ప్రక్కలరెక్కల క్రింద మానవ హస్తములవంటి హస్తములుండెను, నాలుగింటికిని ముఖములును రెక్కలును ఉండెను. వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసికొనెను, ఏ వైపునకైనను తిరుగక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను. ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు. వాటి ముఖములును రెక్కలును వేరు వేరుగా ఉండెను, ఒక్కొక జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి యుండెను; ఒక్కొక జత రెక్కలు వాటి దేహములను కప్పెను.
- Ezekiel 10:10 యెహెజ్కేలు 10:10ఆ నాలుగు చక్రములు ఏకరీతిగానుండి యొక్కొక చక్రమునకులోగా మరియొక చక్రమున్నట్టుగా కనబడెను.