Ezekiel · chapter 30 · verse 8
Ezekiel 30:8 in Telugu
ఐగుప్తుదేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండ చేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
Aiguptudeshamulo agni ragulabetti nenu daaniki sahaayakulu lekunda cheyagaa nenu yehovaanai yunnaanani vaaru telisikonduru.
Ezekiel 30:8 in English
- King James Version (KJV)
- And they shall know that I [am] the LORD, when I have set a fire in Egypt, and [when] all her helpers shall be destroyed.
- World English Bible (WEB)
- They will know that I am the LORD when I have set a fire in Egypt, and all her helpers are destroyed.
- American Standard Version (ASV)
- And they shall know that I am Jehovah, when I have set a fire in Egypt, and all her helpers are destroyed.
- Bible in Basic English (BBE)
- And they will be certain that I am the Lord, when I have put a fire in Egypt and all her helpers are broken.
- Darby Translation (DBY)
- And they shall know that I [am] Jehovah, when I have set a fire in Egypt, and all her helpers shall be broken.
- Webster's Bible (WBS)
- And they shall know that I [am] the LORD, when I have set a fire in Egypt, and [when] all her helpers shall be destroyed.
- Young's Literal Translation (YLT)
- And they have known that I [am] Jehovah, In My giving fire against Egypt, And broken have been all her helpers.
Read in context
- 6యెహోవా సెలవిచ్చునదేమనగా ఐగుప్తును ఉద్ధరించు వారు కూలుదురు, దాని బలగర్వము అణగిపోవును, మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు జనులు ఖడ్గముచేత కూలుదురు.
- 7పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తీయులు దిక్కులేనివారుగా నుందురు, నలుదిక్కుల పాడైపోయిన పట్టణములమధ్య వారి పట్టణము లుండును.
- 8ఐగుప్తుదేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండ చేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
- 9ఆ దినమందు దూతలు నా యెదుట నుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కూషీయులను భయపెట్టుదురు, ఐగుప్తునకు విమర్శకలిగిన దినమున జరిగి నట్టు వారికి భయభ్రాంతులు పుట్టును, అదిగో అది వచ్చే యున్నది.
- 10ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఐగుప్తీయులు చేయు అల్లరి బబులోను రాజైన నెబుకద్రెజరుచేత నేను మాన్పించెదను.
Cross references
- Ezekiel 29:6 యెహెజ్కేలు 29:6అప్పుడు నేను యెహోవానై యున్నానని ఐగుప్తీయులందరు తెలిసికొందరు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లవంటి చేతికఱ్ఱ ఆయెను;
- Amos 1:12 ఆమోసు 1:12తేమానుమీద అగ్ని వేసెదను, అది బొస్రాయొక్క నగరులను దహించివేయును.
- Amos 1:7 ఆమోసు 1:7గాజా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;
- Ezekiel 30:14 యెహెజ్కేలు 30:14పత్రోసును పాడుచేసెదను. సోయనులో అగ్నియుంచెదను, నోలో తీర్పులు చేసెదను.
- Ezekiel 29:9 యెహెజ్కేలు 29:9ఐగుప్తుదేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. నైలునది నాది, నేనే దాని కలుగజేసితినని అతడనుకొను చున్నాడు గనుక
- Ezekiel 22:31 యెహెజ్కేలు 22:31కావున నేను నా క్రోధమును వారిమీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారిమీదికి రప్పించి నా ఉగ్రతాగ్నిచేత వారిని దహింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- Ezekiel 29:16 యెహెజ్కేలు 29:16ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషము మనస్సునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగినయెడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
- Amos 1:4 ఆమోసు 1:4నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను; అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును;
- Amos 1:10 ఆమోసు 1:10నేను తూరు ప్రాకారములమీద అగ్ని వేసెదను, అది దాని నగరులను దహించివేయును.
- Ezekiel 30:16 యెహెజ్కేలు 30:16ఐగుప్తుదేశములో నేను అగ్నియుంచగా సీనునకు మెండుగ నొప్పిపట్టును, నోపురము పడగొట్టబడును, పగటివేళ శత్రువులు వచ్చి నొపుమీద పడుదురు.
- Amos 1:14 ఆమోసు 1:14రబ్బాయొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును; రణకేకలతోను, సుడి గాలి వీచునప్పుడు కలుగు ప్రళయమువలెను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించివేయును.
- Psalm 58:11 కీర్తనలు 58:11కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగు ననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు.