Genesis · chapter 24 · verse 33
Genesis 24:33 in Telugu
అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను.
Ataniki bhojanamu pettinchenu gaani atadu nenu vachchina pani cheppaka munupu bhojanamu cheyananagaa laabaanu cheppumanenu.
Genesis 24:33 in English
- King James Version (KJV)
- And there was set [meat] before him to eat: but he said, I will not eat, until I have told mine errand. And he said, Speak on.
- World English Bible (WEB)
- Food was set before him to eat, but he said, “I will not eat until I have told my message.” Laban said, “Speak on.”
- American Standard Version (ASV)
- And there was set food before him to eat: but he said, I will not eat, until I have told mine errand. And he said, Speak on.
- Bible in Basic English (BBE)
- And meat was put before him, but he said, I will not take food till I have made my business clear to you. And they said, Do so.
- Darby Translation (DBY)
- And there was set [meat] before him to eat; but he said, I will not eat until I have made known my business. And he said, Speak on.
- Webster's Bible (WBS)
- And there was set [food] before him to eat: but he said, I will not eat, until I have told my errand. And he said, Speak on.
- Young's Literal Translation (YLT)
- and setteth before him to eat; but he saith, 'I do not eat till I have spoken my word;' and he saith, 'Speak.'
Read in context
- 31లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము; నీవు బయట నిలువనేల? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిననెను.
- 32ఆ మనుష్యుడు ఇంటికి వచ్చి నప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్లు కడుగు కొనుటకు అతనికిని అతనితో కూడ నున్నవారికిని నీళ్లు ఇచ్చి
- 33అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను.
- 34అంతట అతడిట్లనెను. నేను అబ్రాహాము దాసుడను,
- 35యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను.
Cross references
- Psalm 132:3–5 కీర్తనలు 132:3–5యాకోబుయొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడిచేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబుయొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారములో నేను బ్రవేశింపను నేను పరుండు మంచముమీది కెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యననెను.
- 1 Timothy 6:2 1 తిమోతికి 6:2విశ్వాసులైన యజమానులుగల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవాఫలము పొందువారు విశ్వాసులును ప్రియులునై యున్నారని మరి యెక్కువగా వారికి సేవచేయవలెను; ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము.
- Ephesians 6:5–8 ఎఫెసీయులకు 6:5–8దాసులారా, యథార్థమైన హృదయముగలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకువలె, శరీర విషయమై మీ యజమానులైనవారికి విధేయులై యుండుడి. మను ష్యులను సంతోషపెట్టువారు చేయు నట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరి గించుచు, మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యముచేయునో దాని ఫలము ప్రభువువలన పొందునని మీరెరుగుదురు.
- Ecclesiastes 9:10 ప్రసంగి 9:10చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.
- Job 23:12 యోబు 23:12ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు ఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని.
- John 4:31–34 యోహాను 4:31–34ఆ లోగా శిష్యులుబోధకుడా, భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి. అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైన నేమైనను తెచ్చెనేమో అని యొకనితో ఒకడు చెప్పు కొనిరి. యేసు వారిని చూచినన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.
- John 4:14 యోహాను 4:14నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.
- Proverbs 22:29 సామెతలు 22:29తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.