Genesis · chapter 31 · verse 5
Genesis 31:5 in Telugu
మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడైయున్నాడు;
Mee tandri kataakshamu ninna monna naameeda undinatlu ippudu naameeda nundaledani naaku kanabaduchunnadi; ayite naa tandriyokka devudu naaku todaiyunnaadu;
Genesis 31:5 in English
- King James Version (KJV)
- And said unto them, I see your father’s countenance, that it [is] not toward me as before; but the God of my father hath been with me.
- World English Bible (WEB)
- and said to them, “I see the expression on your father’s face, that it is not toward me as before; but the God of my father has been with me.
- American Standard Version (ASV)
- and said unto them, I see your father’s countenance, that it is not toward me as beforetime; but the God of my father hath been with me.
- Bible in Basic English (BBE)
- And he said to them, It is clear to me that your father's feeling is no longer what it was to me; but the God of my father has been with me
- Darby Translation (DBY)
- and said to them, I see your father's countenance, that it is not toward me as previously; but the God of my father has been with me.
- Webster's Bible (WBS)
- And said to them, I see your father's countenance, that it [is] not towards me as before: but the God of my father hath been with me.
- Young's Literal Translation (YLT)
- and saith to them, 'I am beholding your father's face — that it is not towards me as heretofore, and the God of my father hath been with me,
Read in context
- 3అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా
- 4యాకోబు పొలములో తన మందయొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో యిట్లనెను.
- 5మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడైయున్నాడు;
- 6మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసే యున్నది.
- 7మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను; అయినను దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.
Cross references
- Genesis 31:2–3 ఆదికాండము 31:2–3మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనియెడల ఉండలేదు. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా
- Genesis 31:42 ఆదికాండము 31:42నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.
- Genesis 48:15 ఆదికాండము 48:15అతడు యోసేపును దీవించి - నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవని యెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు,
- Genesis 31:53 ఆదికాండము 31:53అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవునితోడని ప్రమాణము చేసెను.
- Genesis 50:17 ఆదికాండము 50:17నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించిన దేమనగా - మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసులా అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఈలాగు మాటలాడుచుండగా అతడు ఏడ్చెను.
- Genesis 32:9 ఆదికాండము 32:9అప్పుడు యాకోబు - నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా,
- Genesis 31:13 ఆదికాండము 31:13నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.
- Genesis 21:22 ఆదికాండము 21:22ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడినీవు చేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక.