Genesis · chapter 43 · verse 1
Genesis 43:1 in Telugu
ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక
Aa deshamandu karavu bhaaramugaa undenu ganuka
Genesis 43:1 in English
- King James Version (KJV)
- And the famine [was] sore in the land.
- World English Bible (WEB)
- The famine was severe in the land.
- American Standard Version (ASV)
- And the famine was sore in the land.
- Bible in Basic English (BBE)
- Now the land was in bitter need of food.
- Darby Translation (DBY)
- And the famine was grievous in the land.
- Webster's Bible (WBS)
- And the famine [was] severe in the land.
- Young's Literal Translation (YLT)
- And the famine [is] severe in the land;
Read in context
- 1ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక
- 2వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి - మీరు మరల వెళ్లి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా
- 3యూదా అతని చూచి - ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను.
Cross references
- Genesis 12:10 ఆదికాండము 12:10అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను. ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్లెను.
- Ecclesiastes 9:1–2 ప్రసంగి 9:1–2నీతిమంతులును జ్ఞానులును వారి క్రియలును దేవుని వశమను సంగతిని, స్నేహము చేయుటయైనను ద్వేషించు టయైనను మనుష్యుల వశమున లేదను సంగతిని, అది యంతయు వారివలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప బూనుకొంటిని. సంభవించునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభ వించును; నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించువారికిని బలుల నర్పింపని వారికిని గతియొక్కటే; మంచివారికేలాగుననో పాపాత్ములకును ఆలాగుననే తటస్థించును; ఒట్టు పెట్టుకొను వారికేలాగుననో ఒట్టుకు భయపడువారికిని ఆలాగుననే జరుగును.
- Acts 7:11–13 అపొస్తలుల కార్యములు 7:11–13తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటికిని కరవును బహు శ్రమయువచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని, మన పితరులను అక్కడికి మొదటి సారి పంపెను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసి కొనెను; అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను.
- Genesis 18:13 ఆదికాండము 18:13అంతట యెహోవా అబ్రాహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల?
- Lamentations 5:10 విలాపవాక్యములు 5:10మహా క్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు పెక్కెను.
- Genesis 42:5 ఆదికాండము 42:5కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితోకూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి.
- Genesis 41:54–57 ఆదికాండము 41:54–57యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను. ఐగుప్తు దేశమందంతటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి, అప్పుడు ఫరో - మీరు యోసేపు నొద్దకు వెళ్లి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను. కరవు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరవు భారముగా ఉండెను; మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.