Genesis · chapter 5 · verse 29
Genesis 5:29 in Telugu
భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయము లోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను.
Bhoomini yehovaa shapinchinanduvalana kaligina mana chetula kashtamu vishayamulonu mana pani vishayamu lonu itadu manaku nemmadi kalugajeyunanukoni ataniki novahu ani peru pettenu.
Genesis 5:29 in English
- King James Version (KJV)
- And he called his name Noah, saying, This [same] shall comfort us concerning our work and toil of our hands, because of the ground which the LORD hath cursed.
- World English Bible (WEB)
- He named him Noah, saying, “This one will comfort us in our work and in the toil of our hands, caused by the ground which the LORD has cursed.”
- American Standard Version (ASV)
- and he called his name Noah, saying, This same shall comfort us in our work and in the toil of our hands, [which cometh] because of the ground which Jehovah hath cursed.
- Bible in Basic English (BBE)
- And he gave him the name of Noah, saying, Truly, he will give us rest from our trouble and the hard work of our hands, because of the earth which was cursed by God.
- Darby Translation (DBY)
- And he called his name Noah, saying, This [one] shall comfort us concerning our work and concerning the toil of our hands, because of the ground which Jehovah has cursed.
- Webster's Bible (WBS)
- And he called his name Noah, saying, This [same] shall comfort us concerning our work and toil of our hands, because of the ground which the LORD hath cursed.
- Young's Literal Translation (YLT)
- and calleth his name Noah, saying, 'This [one] doth comfort us concerning our work, and concerning the labour of our hands, because of the ground which Jehovah hath cursed.'
Read in context
- 27మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- 28లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమారుని కని
- 29భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయము లోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను.
- 30లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- 31లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
Cross references
- Matthew 24:37 మత్తయి 24:37నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును.
- 2 Peter 2:5 2 పేతురు 2:5మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.
- Hebrews 11:7 హెబ్రీయులకు 11:7విశ్వాస మునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాస మునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.
- Genesis 9:24 ఆదికాండము 9:24అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసినదానిని తెలిసికొని -
- Isaiah 54:9 యెషయా 54:9నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను.
- Ezekiel 14:14 యెహెజ్కేలు 14:14నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టిదేశములో నుండినను వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించు కొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Ezekiel 14:20 యెహెజ్కేలు 14:20నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించు కొందురుగాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు
- 1 Peter 3:20 1 పేతురు 3:20దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపి గానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.
- Genesis 7:23 ఆదికాండము 7:23నరులతో కూడ పశువులును పురుగులును ఆకాశ పక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచి వేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.
- Genesis 6:8–9 ఆదికాండము 6:8–9అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.
- Luke 3:36 లూకా 3:36షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,
- Genesis 4:11–12 ఆదికాండము 4:11–12కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింపబడినవాడవు; నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను.