Luke · chapter 3 · verse 36
Luke 3:36 in Telugu
షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,
Shelahu keyinaanuku, keyinaanu arpakshaduku, arpakshadu shemuku, shemu novahuku, novahu lemekuku,
Luke 3:36 in English
- King James Version (KJV)
- Which was [the son] of Cainan, which was [the son] of Arphaxad, which was [the son] of Sem, which was [the son] of Noe, which was [the son] of Lamech,
- World English Bible (WEB)
- the son of Cainan, the son of Arphaxad, the son of Shem, the son of Noah, the son of Lamech,
- American Standard Version (ASV)
- the [son] of Cainan, the [son] of Arphaxad, the [son] of Shem, the [son] of Noah, the [son] of Lamech,
- Bible in Basic English (BBE)
- The son of Cainan, the son of Arphaxad, the son of Shem, the son of Noah, the son of Lamech,
- Darby Translation (DBY)
- of Cainan, of Arphaxad, of Sem, of Noe, of Lamech,
- Webster's Bible (WBS)
- Who was [the son] of Cainan, who was [the son] of Arphaxad, who was [the son] of Shem, who was [the son] of Noah, who was [the son] of Lamech,
- Young's Literal Translation (YLT)
- the [son] of Salah, the [son] of Cainan, the [son] of Arphaxad, the [son] of Shem, the [son] of Noah, the [son] of Lamech,
Read in context
- 34యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెర హుకు, తెరహు నాహోరుకు,
- 35నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,
- 36షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,
- 37లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహల లేలుకు, మహలలేలు కేయినానుకు,
- 38కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.
Cross references
- Genesis 10:21–22 ఆదికాండము 10:21–22మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.
- Genesis 9:1 ఆదికాండము 9:1మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
- Genesis 5:28–32 ఆదికాండము 5:28–32లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయము లోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.
- 2 Peter 2:5 2 పేతురు 2:5మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.
- 1 Peter 3:20 1 పేతురు 3:20దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపి గానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.
- Hebrews 11:7 హెబ్రీయులకు 11:7విశ్వాస మునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాస మునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.
- Genesis 11:10–26 ఆదికాండము 11:10–26షేము వంశావళి ఇది. షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత ఐదువందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను. అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను. షేలహు ఏబెరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను. ఏబెరు పెలెగును కనిన తరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను. పెలెగు రయూను కనిన తరువాత రెండువందల తొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను. రయూ సెరూగును కనిన తరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనిన తరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను. నాహోరు తెరహును కనిన తరువాత నూటపం దొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.
- Ezekiel 14:14 యెహెజ్కేలు 14:14నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టిదేశములో నుండినను వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించు కొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Genesis 9:26–27 ఆదికాండము 9:26–27మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.
- Luke 17:27 లూకా 17:27నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కియ్యబడుచు నుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనముచేసెను.
- Genesis 8:1 ఆదికాండము 8:1దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.
- Genesis 7:23 ఆదికాండము 7:23నరులతో కూడ పశువులును పురుగులును ఆకాశ పక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచి వేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.