Genesis · chapter 9 · verse 19
Genesis 9:19 in Telugu
ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.
Ee mugguru novahu kumaarulu; veeri santaanamu bhoomiyandantata vyaapinchenu.
Genesis 9:19 in English
- King James Version (KJV)
- These [are] the three sons of Noah: and of them was the whole earth overspread.
- World English Bible (WEB)
- These three were the sons of Noah, and from these the whole earth was populated.
- American Standard Version (ASV)
- These three were the sons of Noah: and of these was the whole earth overspread.
- Bible in Basic English (BBE)
- These three were the sons of Noah and from them all the earth was peopled.
- Darby Translation (DBY)
- These three are the sons of Noah; and from these was [the population of] the whole earth spread abroad.
- Webster's Bible (WBS)
- These three [were] the sons of Noah: and from them was the whole earth overspread.
- Young's Literal Translation (YLT)
- These three [are] sons of Noah, and from these hath all the earth been overspread.
Read in context
- 17మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.
- 18ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి.
- 19ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.
- 20నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను.
- 21పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను.
Cross references
- 1 Chronicles 1:4–28 1 దినవృత్తాంతములు 1:4–28నోవహు షేము హాము యాపెతు. యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా. యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము. హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను. కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను. కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు. లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు. కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను. యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు హివ్వీయులు అర్కీయులు సీనీయులు అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును హదోరమును ఊజాలును దిక్లానును ఏబాలును అబీమా యేలును షేబను ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు. షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ సెరూగు నాహోరు తెరహు అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రాహాము కుమారులు, ఇస్సాకు ఇష్మాయేలు.
- Genesis 10:2–32 ఆదికాండము 10:2–32యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు. యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు. వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారము, వారివారి భాషలప్రకారము, వారివారి వంశముల ప్రకారము, ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు. కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్టణము. మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను పత్రుసీయులను కస్లూ హీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలోనుండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను హివ్వీయులను అర్కీయులను సినీయులను అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజావరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిములకు వెళ్లు మార్గములో లాషా వరకును ఉన్నది. వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులను బట్టియు హాము కుమారులు. మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు. అరాము కుమారులు ఊజుహూలు గెతెరు మాషనువారు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును హదోరమును ఊజాలును దిక్లాను ఓబాలును అబీమాయెలును షేబను ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు. మేషానుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము. వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషలప్రకారము తమతమ దేశములనుబట్టియు తమతమ జాతులనుబట్టియు షేము కుమారులు. వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను.
- Genesis 8:17 ఆదికాండము 8:17పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్తశరీరులలో నీతో కూడనున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను.
- Genesis 5:32 ఆదికాండము 5:32నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.