Genesis · chapter 5 · verse 32
Genesis 5:32 in Telugu
నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.
Novahu aiduvandala yendlu galavaadai shemunu haamunu yaapetunu kanenu.
Genesis 5:32 in English
- King James Version (KJV)
- And Noah was five hundred years old: and Noah begat Shem, Ham, and Japheth.
- World English Bible (WEB)
- Noah was five hundred years old, then Noah became the father of Shem, Ham, and Japheth.
- American Standard Version (ASV)
- And Noah was five hundred years old: and Noah begat Shem, Ham, and Japheth.
- Bible in Basic English (BBE)
- And when Noah was five hundred years old, he became the father of Shem, Ham, and Japheth.
- Darby Translation (DBY)
- And Noah was five hundred years old, and Noah begot Shem, Ham, and Japheth.
- Webster's Bible (WBS)
- And Noah was five hundred years old: and Noah begat Shem, Ham, and Japheth.
- Young's Literal Translation (YLT)
- And Noah is a son of five hundred years, and Noah begetteth Shem, Ham, and Japheth.
Read in context
- 30లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- 31లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- 32నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.
Cross references
- Genesis 10:21 ఆదికాండము 10:21మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.
- Genesis 6:10 ఆదికాండము 6:10షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను.
- Genesis 10:1 ఆదికాండము 10:1ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపెతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.
- 1 Chronicles 1:4–28 1 దినవృత్తాంతములు 1:4–28నోవహు షేము హాము యాపెతు. యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా. యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము. హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను. కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను. కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు. లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు. కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను. యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు హివ్వీయులు అర్కీయులు సీనీయులు అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును హదోరమును ఊజాలును దిక్లానును ఏబాలును అబీమా యేలును షేబను ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు. షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ సెరూగు నాహోరు తెరహు అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రాహాము కుమారులు, ఇస్సాకు ఇష్మాయేలు.
- Genesis 10:32 ఆదికాండము 10:32వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను.
- Genesis 9:22–27 ఆదికాండము 9:22–27అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుట వలన తమ తండ్రి దిసమొలను చూడలేదు. అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసినదానిని తెలిసికొని - కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.
- Genesis 9:18–19 ఆదికాండము 9:18–19ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.
- Luke 3:36 లూకా 3:36షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,
- Genesis 7:13 ఆదికాండము 7:13ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితోకూడ అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి.