Haggai · chapter 1 · verse 9
Haggai 1:9 in Telugu
విస్తారముగా కావలెనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను; మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని; ఎందు చేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరు మీ మీ యిండ్లు కట్టుకొను టకు త్వరపడుటచేతనే గదా.
Vistaaramugaa kaavalenani meeru eduru choochitiri gaani konchemugaa pandenu; meeru daanini intiki tegaa nenu daanini chedaragottitini; endu chetanani yehovaa aduguchunnaadu. Naa mandiramu paadaiyundagaa meerandaru mee mee yindlu kattukonu taku tvarapadutachetane gadaa.
Haggai 1:9 in English
- King James Version (KJV)
- Ye looked for much, and, lo, [it came] to little; and when ye brought [it] home, I did blow upon it. Why? saith the LORD of hosts. Because of mine house that [is] waste, and ye run every man unto his own house.
- World English Bible (WEB)
- “You looked for much, and, behold, it came to little; and when you brought it home, I blew it away. Why?” says the LORD of Armies, “Because of my house that lies waste, while each of you is busy with his own house.
- American Standard Version (ASV)
- Ye looked for much, and, lo, it came to little; and when ye brought it home, I did blow upon it. Why? saith Jehovah of hosts. Because of my house that lieth waste, while ye run every man to his own house.
- Bible in Basic English (BBE)
- You were looking for much, and it came to little; and when you got it into your house, I took it away with a breath. Why? says the Lord of armies. Because of my house which is a waste, while every man takes care of the house which is his.
- Darby Translation (DBY)
- Ye looked for much, and behold it was little; and when ye brought it home, I blew upon it. Wherefore? saith Jehovah of hosts. Because of my house that lieth waste, whilst ye run every man to his own house.
- Webster's Bible (WBS)
- Ye looked for much, and lo, [it came] to little; and when ye brought [it] home, I did blow upon it. Why? saith the LORD of hosts. Because of my house that [is] waste, and ye run every man to his own house.
- Young's Literal Translation (YLT)
- Looking for much, and lo, little, And ye brought [it] home, and I blew on it, Wherefore? — an affirmation of Jehovah of Hosts, Because of My house that is waste, And ye are running — each to his house,
Read in context
- 7కాగా సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.
- 8పర్వతములెక్కి మ్రాను తీసికొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినయెడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- 9విస్తారముగా కావలెనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను; మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని; ఎందు చేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరు మీ మీ యిండ్లు కట్టుకొను టకు త్వరపడుటచేతనే గదా.
- 10కాబట్టి మిమ్మునుబట్టి ఆకాశపుమంచు కురువకయున్నది, భూమి పండక యున్నది.
- 11నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి, ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతిపనులన్నిటి విషయములోను క్షామము పుట్టించియున్నాను.
Cross references
- Haggai 1:4 హగ్గయి 1:4ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నిసించుటకు ఇది సమయమా?
- Malachi 2:2 మలాకీ 2:2సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు ఆ యాజ్ఞను ఆలకింపకయు, నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండినయెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును; మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతిరి గనుక ఇంతకు మునుపే నేను వాటిని శపించి యుంటిని.
- Haggai 2:16–17 హగ్గయి 2:16–17నాటనుండి యొకడు ఇరువది కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలు చున్నది; తీసికొనవలెనని ఏబది కొలల తొట్టియొద్దకు ఒకడు రాగా ఇరువదికొలలు మాత్రమేదొరకును. తెగులుతోను కాటుకతోను వడగండ్లతోను మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసియున్నాను; అయినను మీలో ఒకడును తిరిగి నాయొద్దకు రాలేదు; ఇదే యెహోవా వాక్కు.
- Revelation 3:19 ప్రకటన 3:19నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.
- Haggai 1:6 హగ్గయి 1:6మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.
- Isaiah 40:7 యెషయా 40:7యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే.
- Psalm 77:5–10 కీర్తనలు 77:5–10తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పి పోయెనా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా?(సెలా. ) అందుకునేనీలాగు అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొను టకు నాకు కలిగిన శ్రమయే కారణము.
- Matthew 10:37–38 మత్తయి 10:37–38తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కు వగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.
- Joshua 7:10–15 యెహోషువ 7:10–15యెహోవా యెహోషువతో ఇట్లనెనులెమ్ము, నీ వేల యిక్కడ ముఖము నేల మోపికొందువు? ఇశ్రాయేలీ యులు పాపము చేసియున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసికొని, దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని యున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులయెదుట నిలువలేక తమ శత్రువుల యెదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైనవారు మీ మధ్యనుండకుండ మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైయుండను. నీవు లేచి జనులను పరిశుద్ధపఱచి వారితో ఈలాగు చెప్పుమురేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగాఇశ్రాయేలీయు లారా, మీ మధ్య శాపగ్రస్తమైన దొకటి కలదు; మీరు దానిని మీ మధ్య నుండకుండ నిర్మూ లము చేయువరకు మీ శత్రువుల యెదుట మీరు నిలువలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసనుబట్టి మీరు రప్పింపబడుదురు; అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుసప్రకారము దగ్గరకు రావలెను; యెహోవా సూచించు వంశము కుటుంబములప్రకారము దగ్గరకు రావలెను; యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుసప్రకారము దగ్గరకు రావలెను. అప్పుడు శపిత మైనది యెవనియొద్ద దొరుకునో వానిని వానికి కలిగినవారి నందరిని అగ్నిచేత కాల్చివేయవలెను, ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కా ర్యము చేసినవాడు అనెను.
- 2 Kings 19:7 2 రాజులు 19:7అతనిలో ఒక యాత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళి పోవును; తన దేశమందు కత్తిచేత అతని కూలచేయుదును.
- Malachi 3:8–11 మలాకీ 3:8–11మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి; దేనివిషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరం దురు. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరును నాయొద్ద దొంగిలుచునే యున్నారు, మీరు శాపగ్రస్తులై యున్నారు. నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనముచేయవు, మీ ద్రాక్షచెట్లు అకాలఫలములను రాల్పకయుండునని సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు
- 1 Corinthians 11:30–32 1 కొరింథీయులకు 11:30–32ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగు లునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడు చున్నాము.
Original words (Hebrew)
- looked · H6437פָּנָה pânâh
- much · H7235רָבָה râbâh
- little · H4592מְעַט mᵉʻaṭ
- brought · H935בּוֹא bôwʼ
- home · H1004בַּיִת bayith
- blow · H5301נָפַח nâphach
- saith · H5002נְאֻם nᵉʼum
- hosts · H6635צָבָא tsâbâʼ
- Because · H3282יַעַן yaʻan
- house · H1004בַּיִת bayith
- waste · H2720חָרֵב chârêb
- run · H7323רוּץ rûwts
- man · H376אִישׁ ʼîysh
- house · H1004בַּיִת bayith