Hebrews · chapter 11 · verse 35
Hebrews 11:35 in Telugu
స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి.
Streelu mrutulaina tama vaarini punarutthaanamuvalana marala pondiri. Kondaraite mari shreshthamaina punarutthaanamu pondagori vidudala pondanollaka yaatanapettabadiri.
Hebrews 11:35 in English
- King James Version (KJV)
- Women received their dead raised to life again: and others were tortured, not accepting deliverance; that they might obtain a better resurrection:
- World English Bible (WEB)
- Women received their dead by resurrection. Others were tortured, not accepting their deliverance, that they might obtain a better resurrection.
- American Standard Version (ASV)
- Women received their dead by a resurrection: and others were tortured, not accepting their deliverance; that they might obtain a better resurrection:
- Bible in Basic English (BBE)
- Women had their dead given back to them living; others let themselves be cruelly attacked, having no desire to go free, so that they might have a better life to come;
- Darby Translation (DBY)
- Women received their dead again by resurrection; and others were tortured, not having accepted deliverance, that they might get a better resurrection;
- Webster's Bible (WBS)
- Women received their dead raised to life again: and others were tortured, not accepting deliverance; that they might obtain a better resurrection:
- Young's Literal Translation (YLT)
- Women received by a rising again their dead, and others were tortured, not accepting the redemption, that a better rising again they might receive,
Read in context
- 33వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి;
- 34అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి.
- 35స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి.
- 36మరికొందరు తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభ వించిరి.
- 37రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొఱ్ఱెచర్మ ములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు,
Cross references
- 2 Kings 4:27–37 2 రాజులు 4:27–37పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనునియొద్దకు వచ్చి అతని కాళ్లు పట్టు కొనెను. గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడుఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను; ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమెకుమారుడు కావలెనని నేను నా యేలిన వాడవైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా? అని అతనితో మనవి చేయగా అతడునీ నడుము బిగించు కొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము; ఎవరైనను నీకు ఎదురుపడిన యెడల వారికి నమస్కరింపవద్దు; ఎవరైనను నీకు నమస్కరించినయెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు; అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖముమీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట వినియెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడ పోయెను. గేహజీ వారికంటె ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖముమీద పెట్టెను గాని యే శబ్దమును రాకపోయెను, ఏమియు వినవచ్చినట్టు కన బడలేదు గనుక వాడు ఏలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను. ఎలీషా ఆ యింట జొచ్చి, బాలుడు మరణమైయుండి తన మంచముమీద పెట్టబడి యుండుట చూచి తానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి, యెహోవాకు ప్రార్థనచేసి మంచముమీద ఎక్కి బిడ్డమీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటిమీదను తన కండ్లు వాని కండ్లమీదను తన చేతులు వాని చేతులమీదను ఉంచి, బిడ్డమీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి యింటిలో ఇవతలనుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి, మరల మంచముమీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను. అప్పుడతడు గేహజీని పిలిచిఆ షూనే మీయురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలి చెను. ఆమె అతనియొద్దకు రాగా అతడునీ కుమారుని ఎత్తికొనుమని ఆమెతో చెప్పెను. అంతట ఆమె లోప లికివచ్చి అతని కాళ్లమీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తికొనిపోయెను.
- 1 Kings 17:22–24 1 రాజులు 17:22–24యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను. ఏలీయా ఆ చిన్నవాని తీసికొని గదిలోనుండి దిగి యింట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి - ఇదిగో నీ కుమారుడు; వాడు బ్రదుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలీయాతోనీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదు ననెను.
- Philippians 3:11 ఫిలిప్పీయులకు 3:11ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.
- Acts 9:41 అపొస్తలుల కార్యములు 9:41అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను.
- Acts 24:15 అపొస్తలుల కార్యములు 24:15నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగ బోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడ దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.
- 1 Corinthians 15:54 1 కొరింథీయులకు 15:54ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్య మైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.
- Acts 23:6 అపొస్తలుల కార్యములు 23:6వారిలో ఒక భాగము సద్దూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై యున్నట్టు పౌలు గ్రహించి సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణనుగూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను.
- John 11:40–45 యోహాను 11:40–45అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను. ఆయన ఆలాగు చెప్పిలాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను. కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్య మును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని
- Luke 7:12–16 లూకా 7:12–16ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చి నప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమెయందుకనికరపడి - ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరు భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి.
- Luke 14:14 లూకా 14:14నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.
- Acts 22:29 అపొస్తలుల కార్యములు 22:29కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలిసికొన్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతికూడ భయపడెను.
- John 5:29 యోహాను 5:29మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.
Original words (Greek)
- Women · G1135γυνή gynḗ
- received · G2983λαμβάνω lambánō
- their · G846αὐτός autós
- dead · G3498νεκρός nekrós
- again · G386ἀνάστασις anástasis
- and · G1161δέ dé
- others · G243ἄλλος állos
- tortured · G5178τυμπανίζω tympanízō
- not · G3756οὐ ou
- accepting · G4327προσδέχομαι prosdéchomai
- deliverance · G629ἀπολύτρωσις apolýtrōsis
- that · G2443ἵνα hína
- obtain · G5177τυγχάνω tynchánō
- a · G386ἀνάστασις anástasis
- better · G2909κρείττων kreíttōn
- resurrection · G386ἀνάστασις anástasis