Hosea · chapter 8 · verse 4
Hosea 8:4 in Telugu
నాకు అనుకూలులుకాని రాజులను వారు నియమించుకొని యున్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకొని యున్నారు, విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగార ములను వినియోగించుటచేత వాటిని పోగొట్టుకొని యున్నారు.
Naaku anukoolulukaani raajulanu vaaru niyaminchukoni yunnaaru, nenerugani adhipatulanu tamakunchukoni yunnaaru, vigraha nirmaanamandu tama vendi bangaara mulanu viniyoginchutacheta vaatini pogottukoni yunnaaru.
Hosea 8:4 in English
- King James Version (KJV)
- They have set up kings, but not by me: they have made princes, and I knew [it] not: of their silver and their gold have they made them idols, that they may be cut off.
- World English Bible (WEB)
- They have set up kings, but not by me. They have made princes, and I didn’t approve. Of their silver and their gold they have made themselves idols, that they may be cut off.
- American Standard Version (ASV)
- They have set up kings, but not by me; they have made princes, and I knew it not: of their silver and their gold have they made them idols, that they may be cut off.
- Bible in Basic English (BBE)
- They have put up kings, but not by me; they have made princes, but I had no knowledge of it; they have made images of silver and gold, so that they may be cut off.
- Darby Translation (DBY)
- They have set up kings, but not by me; they have made princes, and I knew it not; of their silver and their gold have they made them idols, that they may be cut off.
- Webster's Bible (WBS)
- They have set up kings, but not by me: they have made princes, and I knew [it] not: of their silver and their gold have they made for themselves idols, that they may be cut off.
- Young's Literal Translation (YLT)
- They have made kings, and not by Me, They have made princes, and I have not known, Their silver and their gold they have made to them idols, So that they are cut off.
Read in context
- 2వారుమా దేవా, ఇశ్రాయేలువారలమైన మేము నిన్ను ఎరిగియున్న వారమేయని నాకు మొఱ్ఱపెట్టుదురు;
- 3ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును.
- 4నాకు అనుకూలులుకాని రాజులను వారు నియమించుకొని యున్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకొని యున్నారు, విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగార ములను వినియోగించుటచేత వాటిని పోగొట్టుకొని యున్నారు.
- 5షోమ్రోనూ, ఆయన నీ దూడను (విగ్రహము) విసర్జించెను నా కోపము వారిమీదికి రగులు కొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాల కుందురు?
- 6అది ఇశ్రాయేలువారి చేతి పనియే గదా? కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు గదా; షోమ్రోను చేసికొనిన యీ దూడ ఛిన్నాభిన్నములగును.
Cross references
- Hosea 13:9–10 హోషేయ 13:9–10ఇశ్రాయేలూ, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసికొనుచున్నావు. నీ పట్టణ ములలో దేనియందును నీకు సహాయము చేయకుండ నీ రాజు ఏమాయెను? రాజును అధిపతులను నామీద నియమించుమని నీవు మనవి చేసికొంటివిగదా; నీ అధిపతులు ఏమైరి?
- 2 Kings 15:10–30 2 రాజులు 15:10–30యాబేషు కుమారుడైన షల్లూము అతనిమీద కుట్రచేసి, జనులు చూచుచుండగా అతనిమీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను. జెకర్యా చేసిన కార్యములనుగూర్చి ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. నీ కుమారులు నాలుగవ తరమువరకు ఇశ్రాయేలు సింహాసనముమీద ఆసీనులై యుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాటచొప్పున ఇది జరిగెను. యూదారాజైన ఉజ్జియా యేలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో నెల దినములు ఏలెను. గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలోనుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులోనుండు యాబేషు కుమారుడైన షల్లూముమీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను. షల్లూము చేసిన యితర కార్య ములనుగూర్చియు, అతడు చేసిన కుట్రనుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది. మెనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారినంద రిని హతము చేసి, తిర్సాను దాని చేరువ గ్రామములనన్నిటిని కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను. యూదారాజైన అజర్యా యేలుబడిలో ముప్పదితొమ్మి దవ సంవత్సరమందు గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలువారిని ఏలనారంభించి షోమ్రోనులో పది సంవత్సరములు ఏలెను. ఇతడును తన దినములన్నియు ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక యనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అష్షూరు రాజైన పూలు దేశముమీదికి రాగా, మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలుచేత సంధి చేయించుకొనవలెనని రెండు వేల మణుగుల వెండి పూలునకు ఇచ్చెను. మెనహేము ఇశ్రా యేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను ఏబదేసి తులముల వెండి వసూలుచేసి యీ ద్రవ్య మును అష్షూరు రాజునకిచ్చెను గనుక అష్షూరురాజు దేశ మును విడిచి వెళ్లిపోయెను. మెనహేము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. మెనహేము తన పితరులతో కూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయెను. యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదియవ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకహు కుట్ర చేసి, తనయొద్దనున్న గిలాదీయులైన యేబది మందితోను, అర్గోబుతోను, అరీహేనుతోను కలిసికొని షోమ్రోనులోనున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి, పెకహ్యాకు మారుగా రాజాయెను. పెకహ్యా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదాని నంత టినిగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదిరెండవ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రో నులో ఇశ్రాయేలును ఏలనారంభించి యిరువది సంవత్సర ములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని అచ్చట నున్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసికొని పోయెను. అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహుమీద కుట్రచేసి, అతనిమీద పడి అతని చంపి, యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరువదియవ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను.
- Hosea 13:2 హోషేయ 13:2ఇప్పుడు వారు పాపము పెంపుచేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయు దురు, అదంతయు పనివారు చేయు పనియే, వాటికి బలులను అర్పించువారుదూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పు దురు.
- 1 Kings 16:31 1 రాజులు 16:31నెబాతు కుమారుడైన యరొ బాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి యనుకొని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును వివాహము చేసికొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచునుండెను.
- John 10:14 యోహాను 10:14నేను గొఱ్ఱెల మంచి కాపరిని.
- 1 Kings 12:16–20 1 రాజులు 12:16–20కాబట్టి ఇశ్రాయేలువారందరును రాజు తమ విన్నపమును వినలేదని తెలిసికొని రాజుకీలాగు ప్రత్యుత్తరమిచ్చిరిదావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీమీ గుడారములకు పోవుడి; దావీదు సంతతివారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారములకు వెళ్లిపోయిరి. అయితే యూదా పట్ణణములలోనున్న ఇశ్రాయేలువారిని రెహబాము ఏలెను. తరువాత రాజైన రెహబాము వెట్టిపని వారిమీద అధికారి యైన అదోరామును పంపగా ఇశ్రాయేలువారందరును రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను, కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని తన రథముమీద త్వరగా ఎక్కెను. ఈ ప్రకారము ఇశ్రాయేలువారు నేటివరకు జరుగుచున్నట్లు దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసిరి. మరియు యరొబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరు విని, సమా జముగా కూడి, అతని పిలువనంపించి ఇశ్రాయేలువారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి; యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతివారిని వెంబడించినవా రెవరును లేకపోయిరి.
- Hosea 2:8 హోషేయ 2:8దానికి ధాన్య ద్రాక్షారసతైలము లను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే యని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను.
- 1 Kings 12:28 1 రాజులు 12:28ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచియెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము;
- Galatians 4:9 గలతీయులకు 4:9యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బల హీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?
- Luke 13:25 లూకా 13:25ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు
- 1 Kings 13:34 1 రాజులు 13:34యరొబాముసంతతివారిని నిర్మూలము చేసి భూమిమీద ఉండకుండ నశింపజేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయెను.
- Jeremiah 44:7–8 యిర్మీయా 44:7–8కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు అజ్ఞ ఇచ్చుచున్నాడు ఏమియు శేషములేకుండ స్త్రీ పురుషులును శిశువులును చంటి బిడ్డలును యూదా మధ్య నుండ కుండ నిర్మూలము చేయబడునట్లుగా మీరేల ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసికొనుచున్నారు? మీకుమీరే సమూలనాశనము తెచ్చుకొనునట్లును, భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణపాలై తిరస్కరింపబడునట్లును, మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్యదేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేల యీలాగున చేయుచు మీ చేతిక్రియలచేత నాకు కోపము పుట్టించుచున్నారు?