Isaiah · chapter 52 · verse 14
Isaiah 52:14 in Telugu
నిన్ను చూచి యే మనిషిరూపముకంటె అతని ముఖమును, నరరూపముకంటె అతని రూపమును చాల వికారమని చాలమంది యేలాగు విస్మయమొందిరొ
Ninnu choochi ye manishiroopamukante atani mukhamunu, nararoopamukante atani roopamunu chaala vikaaramani chaalamandi yelaagu vismayamondiro
Isaiah 52:14 in English
- King James Version (KJV)
- As many were astonied at thee; his visage was so marred more than any man, and his form more than the sons of men:
- World English Bible (WEB)
- Just as many were astonished at you— his appearance was marred more than any man, and his form more than the sons of men—
- American Standard Version (ASV)
- Like as many were astonished at thee (his visage was so marred more than any man, and his form more than the sons of men),
- Bible in Basic English (BBE)
- As peoples were surprised at him, And his face was not beautiful, so as to be desired: his face was so changed by disease as to be unlike that of a man, and his form was no longer that of the sons of men.
- Darby Translation (DBY)
- As many were astonished at thee — his visage was so marred more than any man, and his form more than the children of men
- Webster's Bible (WBS)
- As many were astonished at thee; his visage was so marred more than any man, and his form more than the sons of men:
- Young's Literal Translation (YLT)
- As astonished at thee have been many, (So marred by man his appearance, And his form by sons of men.)
Read in context
- 12మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును
- 13ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును.
- 14నిన్ను చూచి యే మనిషిరూపముకంటె అతని ముఖమును, నరరూపముకంటె అతని రూపమును చాల వికారమని చాలమంది యేలాగు విస్మయమొందిరొ
- 15ఆలాగే అతడు అనేక జనములను చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసికొనెదరు తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు తాము విననిదానిని గ్రహింతురు.
Cross references
- Matthew 26:67 మత్తయి 26:67అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి;
- Isaiah 50:6 యెషయా 50:6కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు
- Isaiah 53:2–5 యెషయా 53:2–5లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.
- Psalm 22:6–7 కీర్తనలు 22:6–7నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడిం చుచు నన్ను అపహసించుచున్నారు.
- Psalm 22:17 కీర్తనలు 22:17నా యెముకలన్నియు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు
- Matthew 27:14 మత్తయి 27:14అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.
- Psalm 71:7 కీర్తనలు 71:7నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే.
- Matthew 27:29–30 మత్తయి 27:29–30ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి.
- Psalm 102:3–5 కీర్తనలు 102:3–5పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవు చున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి. ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి పోయి యున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను. నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి.
- Luke 22:64 లూకా 22:64నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి
- Psalm 22:15 కీర్తనలు 22:15నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నదినీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు.
- Matthew 22:22–23 మత్తయి 22:22–23వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లి పోయిరి. పునరుత్థానములేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయనయొద్దకు వచ్చి