Isaiah · chapter 8 · verse 11
Isaiah 8:11 in Telugu
ఈ జనులమార్గమున నడువకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి యీ మాట సెలవిచ్చెను
Ee janulamaargamuna naduvakoodadani yehovaa bahu balamugaa naato cheppiyunnaadu; nannu gaddinchi yee maata selavichchenu
Isaiah 8:11 in English
- King James Version (KJV)
- For the LORD spake thus to me with a strong hand, and instructed me that I should not walk in the way of this people, saying,
- World English Bible (WEB)
- For the LORD spoke this to me with a strong hand, and instructed me not to walk in the way of this people, saying,
- American Standard Version (ASV)
- For Jehovah spake thus to me with a strong hand, and instructed me not to walk in the way of this people, saying,
- Bible in Basic English (BBE)
- For the Lord, controlling me with a strong hand, gave me orders not to go in the way of this people, saying,
- Darby Translation (DBY)
- For Jehovah spoke thus to me with a strong hand, and he instructed me not to walk in the way of this people, saying,
- Webster's Bible (WBS)
- For the LORD spoke thus to me with a strong hand, and instructed me that I should not walk in the way of this people, saying,
- Young's Literal Translation (YLT)
- For thus hath Jehovah spoken unto me with strength of hand, and instructeth me against walking in the way of this people, saying,
Read in context
- 9జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు; దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు.
- 10ఆలోచన చేసికొనినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు.
- 11ఈ జనులమార్గమున నడువకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి యీ మాట సెలవిచ్చెను
- 12ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి వారు భయపడుదానికి భయపడకుడి దానివలన దిగులు పడకుడి.
- 13సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను కొనుడి మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులుపడవలెను అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును.
Cross references
- Ezekiel 3:14 యెహెజ్కేలు 3:14ఆత్మ నన్నెత్తి తోడు కొనిపోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్నిచేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొనిపోయినప్పుడు, యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను.
- Proverbs 1:15 సామెతలు 1:15నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము.
- Jeremiah 15:19 యిర్మీయా 15:19కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను నీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపట్టినయెడల నీవు నా నోటివలె ఉందువు; వారు నీతట్టునకు తిరుగవలెను గాని నీవు వారి తట్టునకు తిరుగకూడదు
- Jeremiah 20:7 యిర్మీయా 20:7యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరే పణకు లోబడితిని; నీవు బలవంతముచేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్ల నవ్వులపాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేయుదురు.
- Acts 4:20 అపొస్తలుల కార్యములు 4:20మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;
- Psalm 32:8 కీర్తనలు 32:8నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను
- Jeremiah 20:9 యిర్మీయా 20:9ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేనను కొంటినా? అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.
- Ezekiel 2:6–8 యెహెజ్కేలు 2:6–8నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్లతుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు; అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగు బాటు చేయువారు వారికి భయపడకుము. వారు తిరుగు బాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము.