Jeremiah · chapter 26 · verse 15
Jeremiah 26:15 in Telugu
అయితే మీకు చెవులార ఈ మాటలన్నిటిని చెప్పుటకు నిజముగా యెహోవా మీయొద్దకు నన్ను పంపియున్నాడు గనుక, మీరు నన్ను చంపినయెడల మీరు మీమీదికిని ఈ పట్టణముమీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలిసికొనుడి.
Ayite meeku chevulaara ee maatalannitini chepputaku nijamugaa yehovaa meeyoddaku nannu pampiyunnaadu ganuka, meeru nannu champinayedala meeru meemeedikini ee pattanamumeedikini daani nivaasula meedikini niraparaadhi raktadoshamu teppinchudurani nissandehamugaa telisikonudi.
Jeremiah 26:15 in English
- King James Version (KJV)
- But know ye for certain, that if ye put me to death, ye shall surely bring innocent blood upon yourselves, and upon this city, and upon the inhabitants thereof: for of a truth the LORD hath sent me unto you to speak all these words in your ears.
- World English Bible (WEB)
- Only know for certain that if you put me to death, you will bring innocent blood on yourselves, on this city, and on its inhabitants; for in truth the LORD has sent me to you to speak all these words in your ears.”
- American Standard Version (ASV)
- Only know ye for certain that, if ye put me to death, ye will bring innocent blood upon yourselves, and upon this city, and upon the inhabitants thereof; for of a truth Jehovah hath sent me unto you to speak all these words in your ears.
- Bible in Basic English (BBE)
- Only be certain that, if you put me to death, you will make yourselves and your town and its people responsible for the blood of one who has done no wrong: for truly, the Lord has sent me to you to say all these words in your ears.
- Darby Translation (DBY)
- only know for certain that if ye put me to death, ye shall surely bring innocent blood upon yourselves, and upon this city, and upon the inhabitants thereof; for of a truth Jehovah hath sent me unto you to speak all these words in your ears.
- Webster's Bible (WBS)
- But know ye for certain, that if ye put me to death, ye will surely bring innocent blood upon yourselves, upon this city, and upon its inhabitants: for of a truth the LORD hath sent me to you to speak all these words in your ears.
- Young's Literal Translation (YLT)
- Only, know ye certainly, that if ye are putting me to death, surely innocent blood ye are putting on yourselves, and on this city, and on its inhabitants; for truly hath Jehovah sent me unto you to speak in your ears all these words.'
Read in context
- 13కాబట్టి యెహోవా మీకు చేసెదనని తాను చెప్పిన కీడునుగూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి.
- 14ఇదిగో నేను మీ వశములోనున్నాను, మీ దృష్టికేది మంచిదో యేది యుక్తమైనదో అదే నాకు చేయుడి.
- 15అయితే మీకు చెవులార ఈ మాటలన్నిటిని చెప్పుటకు నిజముగా యెహోవా మీయొద్దకు నన్ను పంపియున్నాడు గనుక, మీరు నన్ను చంపినయెడల మీరు మీమీదికిని ఈ పట్టణముమీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలిసికొనుడి.
- 16కాగా అధిపతులును జనులందరును యాజకులతోను ప్రవక్తలతోను ఇట్లనిరి ఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామమునుబట్టి మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు.
- 17మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి.
Cross references
- Numbers 35:33 సంఖ్యాకాండము 35:33మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు.
- Proverbs 6:17 సామెతలు 6:17అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును
- Matthew 26:25 మత్తయి 26:25ఆయనను అప్పగించిన యూదాబోధకుడా, నేనా? అని అడుగగా ఆయననీవన్నట్టే అనెను.
- Jeremiah 22:3 యిర్మీయా 22:3యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రిలేనివారినైనను విధవ రాండ్రనైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలుగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి.
- Acts 7:60 అపొస్తలుల కార్యములు 7:60అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.
- Revelation 16:6 ప్రకటన 16:6దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పుతీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని.
- Jeremiah 7:6 యిర్మీయా 7:6పరదేశులను తండ్రిలేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషిరక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండినయెడల
- Jeremiah 22:17 యిర్మీయా 22:17అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపదాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు.
- Matthew 23:30–36 మత్తయి 23:30–36మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులై యున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతొ కొట్టి, పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతు డైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవా లయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతి మంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నియు ఈ తరమువారిమీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- 1 Thessalonians 2:15–16 1 థెస్సలొనీకయులకు 2:15–16ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి, అన్యజనులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడకుండ మమ్మును ఆటంకపరచుచు, దేవునికి ఇష్టులు కానివారును మనుష్యులకందరికి విరోధులునై యున్నారు; దేవుని ఉగ్రత తుదముట్ట వారిమీదికి వచ్చెను.
- 2 Kings 24:4 2 రాజులు 24:4అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలే మును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను.
- Genesis 42:22 ఆదికాండము 42:22మరియు రూబేను ఈ చిన్నవానియెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మనమీద మోపబడుచున్నదని వారి కుత్తర మిచ్చెను.
Original words (Hebrew)
- know · H3045יָדַע yâdaʻ
- certain · H3045יָדַע yâdaʻ
- death · H4191מוּת mûwth
- bring · H5414נָתַן nâthan
- innocent · H5355נָקִי nâqîy
- blood · H1818דָּם dâm
- city · H5892עִיר ʻîyr
- inhabitants · H3427יָשַׁב yâshab
- truth · H571אֶמֶת ʼemeth
- sent · H7971שָׁלַח shâlach
- speak · H1696דָבַר dâbar
- words · H1697דָּבָר dâbâr
- ears · H241אֹזֶן ʼôzen