Job · chapter 10 · verse 2
Job 10:2 in Telugu
నా మీద నేరము మోపకుండుము నీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ జేయుమని నేను దేవునితో చెప్పెదను.
Naa meeda neramu mopakundumu neevela naato vyaajyemaaduchunnaavo naaku teliya jeyumani nenu devunito cheppedanu.
Job 10:2 in English
- King James Version (KJV)
- I will say unto God, Do not condemn me; shew me wherefore thou contendest with me.
- World English Bible (WEB)
- I will tell God, ‘Do not condemn me. Show me why you contend with me.
- American Standard Version (ASV)
- I will say unto God, Do not condemn me; Show me wherefore thou contendest with me.
- Bible in Basic English (BBE)
- I will say to God, Do not put me down as a sinner; make clear to me what you have against me.
- Darby Translation (DBY)
- I will say unto God, Do not condemn me; shew me wherefore thou strivest with me.
- Webster's Bible (WBS)
- I will say to God, Do not condemn me; show me why thou contendest with me.
- Young's Literal Translation (YLT)
- I say unto God, 'Do not condemn me, Let me know why Thou dost strive [with] me.
Read in context
- 1నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డులేకుండ అంగలార్చెదను నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను
- 2నా మీద నేరము మోపకుండుము నీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ జేయుమని నేను దేవునితో చెప్పెదను.
- 3దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచనమీద దయా దృష్టియుంచుటసంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా?
- 4నీ నేత్రములు నరుల నేత్రములవంటివా? నరులు ఆలోచించునట్లు నీవు ఆలోచించువాడవా?
Cross references
- Psalm 139:23–24 కీర్తనలు 139:23–24దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.
- Job 9:29 యోబు 9:29నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల?
- Psalm 143:2 కీర్తనలు 143:2నీ సేవకునితో వ్యాజ్యెమాడకుము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచ బడడు.
- Psalm 38:1–8 కీర్తనలు 38:1–8యెహోవా, కోపోద్రేకముచేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతచేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నామీద భారముగా నున్నది. నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు. నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి. నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను
- Romans 8:1 రోమీయులకు 8:1కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.
- Psalm 6:1–4 కీర్తనలు 6:1–4యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్నుబాగుచేయుము నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుమునీ కృపనుబట్టి నన్ను రక్షించుము.
- Job 8:5–6 యోబు 8:5–6నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును.
- Psalm 109:21 కీర్తనలు 109:21యెహోవా ప్రభువా, నీ నామమునుబట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము.
- Lamentations 5:16–17 విలాపవాక్యములు 5:16–17మా తలమీదనుండి కిరీటము పడిపోయెను మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ. దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సీయోను పర్వతము పాడైనది.
- Job 34:31–32 యోబు 34:31–32ఒకడునేను శిక్షనొందితిని నేను ఇకను పాపము చేయను నాకు తెలియనిదానిని నాకు నేర్పుము నేను దుష్కార్యము చేసియున్న యెడల ఇకను చేయనని దేవునితో చెప్పునా?
- Psalm 25:7 కీర్తనలు 25:7నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము. యెహోవా నీ కృపనుబట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము.
- 1 Corinthians 11:31–32 1 కొరింథీయులకు 11:31–32అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడు చున్నాము.