Job · chapter 9 · verse 29
Job 9:29 in Telugu
నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల?
Nannu doshinigaa enchavalasi vachchenu gadaa kaabatti naaku ee vyarthaprayaasamela?
Job 9:29 in English
- King James Version (KJV)
- [If] I be wicked, why then labour I in vain?
- World English Bible (WEB)
- I will be condemned. Why then do I labor in vain?
- American Standard Version (ASV)
- I shall be condemned; Why then do I labor in vain?
- Bible in Basic English (BBE)
- You will not let me be clear of sin! why then do I take trouble for nothing?
- Darby Translation (DBY)
- Be it that I am wicked, why then do I labour in vain?
- Webster's Bible (WBS)
- [If] I am wicked, why then do I labor in vain?
- Young's Literal Translation (YLT)
- I — I am become wicked; why [is] this? [In] vain I labour.
Read in context
- 27నా శ్రమను మరచిపోయెదననియుదుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగానుండెదననియు నేను అనుకొంటినా?
- 28నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నానునీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చ యముగా ఎరిగియున్నాను
- 29నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల?
- 30నేను హిమముతో నన్ను కడుగుకొనిననుసబ్బుతో నా చేతులు కడుగుకొనినను
- 31నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వంతవస్త్రములకై అసహ్యుడనగుదును.
Cross references
- Job 10:7 యోబు 10:7నీవేల నా దోషమునుగూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపమును ఏల వెదకుచున్నావు?
- Psalm 37:33 కీర్తనలు 37:33వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు.
- Job 10:14–17 యోబు 10:14–17నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువునా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగును నేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. నేను సంతోషించినయెడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నామీద చూపుదువు. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువుఎడతెగక నామీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు ఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవు ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు.
- Job 21:16–17 యోబు 21:16–17వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక. భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా. వారిమీదికి ఆపదవచ్చుట బహు అరుదు గదా.
- Jeremiah 2:35 యిర్మీయా 2:35అయినను నీవునేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నామీదనుండి తొలగిపోయెనని చెప్పు కొనుచున్నావు. ఇదిగోపాపము చేయలేదని నీవు చెప్పిన దానిబట్టి నీతో నాకు వ్యాజ్యెము కలిగినది.
- Psalm 73:13 కీర్తనలు 73:13నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే
- Job 9:22 యోబు 9:22ఏమి చేసినను ఒక్కటే కావున - యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదములేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను.
- Job 10:2 యోబు 10:2నా మీద నేరము మోపకుండుము నీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ జేయుమని నేను దేవునితో చెప్పెదను.
- Job 22:5–30 యోబు 22:5–30నీ చెడుతనము గొప్పది కాదా?నీ దోషములు మితిలేనివి కావా? ఏమియు ఇయ్యకయే నీ సోదరులయొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను తీసికొంటివి దప్పిచేత ఆయాసపడినవారికి నీళ్లియ్యవైతివి ఆకలిగొనినవానికి అన్నము పెట్టకపోతివి. బాహుబలముగల మనుష్యునికే భూమి ప్రాప్తించును ఘనుడని యెంచబడినవాడు దానిలో నివసించును. విధవరాండ్రను వట్టిచేతులతో పంపివేసితివి తండ్రిలేనివారి చేతులు విరుగగొట్టితివి. కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి ఆకస్మిక భయము నిన్ను బెదరించుచున్నది. నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు చూచుట లేదా?నిన్ను ముంచబోవు ప్రళయజలములను నీవు చూచుట లేదా? దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా?నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంతపైగా నున్నవి? దేవునికి ఏమి తెలియును?గాఢాంధకారములోనుండి ఆయన న్యాయము కనుగొనునా? గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి, ఆయన చూడలేదుఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు. పూర్వమునుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా? వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని పోయెను. ఆయన మంచి పదార్థములతో వారి యిండ్లను నింపినను మాయొద్ద నుండి తొలగిపొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై యుండునుగాక. మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసెననియు పలుకుచు నీతిమంతులు దాని చూచి సంతోషించుదురు నిర్దోషులు వారిని హేళన చేయుదురు. ఆయనతో సహవాసము చేసినయెడల నీకు సమాధానము కలుగునుఆలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడలనీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవుదేవునితట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థనచేయగాఆయన నీ మనవి నాలకించునునీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైన యోచనచేయగా అది నీకుస్థిరపరచబడునునీ మార్గములమీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడుమీదు చూచెదనందువువినయముగలవానిని ఆయన రక్షించును. నిర్దోషికానివానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధివలన విడిపింపబడును.
- Job 21:27 యోబు 21:27మీ తలంపులు నేనెరుగుదును మీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి.