Job · chapter 17 · verse 4
Job 17:4 in Telugu
నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివి కావున నీవు వారిని హెచ్చింపవు.
Neevu vaari hrudayamunaku jnyaanamu maruguchesitivi kaavuna neevu vaarini hechchimpavu.
Job 17:4 in English
- King James Version (KJV)
- For thou hast hid their heart from understanding: therefore shalt thou not exalt [them].
- World English Bible (WEB)
- For you have hidden their heart from understanding, therefore you will not exalt them.
- American Standard Version (ASV)
- For thou hast hid their heart from understanding: Therefore shalt thou not exalt [them].
- Bible in Basic English (BBE)
- You have kept their hearts from wisdom: for this cause you will not give them honour.
- Darby Translation (DBY)
- For thou hast hidden their heart from understanding; therefore thou wilt not exalt [them].
- Webster's Bible (WBS)
- For thou hast hid their heart from understanding: therefore shalt thou not exalt [them] .
- Young's Literal Translation (YLT)
- For their heart Thou hast hidden From understanding, Therefore Thou dost not exalt them.
Read in context
- 2ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారు వారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగానున్నవి.
- 3ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము మరి యెవడు నా నిమిత్తము పూటపడును?
- 4నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివి కావున నీవు వారిని హెచ్చింపవు.
- 5ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునోవాని పిల్లల కన్నులు క్షీణించును.
- 6ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి యున్నాడునలుగురు నా ముఖముమీద ఉమ్మివేయుదురు.
Cross references
- Matthew 11:25 మత్తయి 11:25ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
- Matthew 13:11 మత్తయి 13:11పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింప బడలేదు.
- 2 Samuel 17:14 2 సమూయేలు 17:14అబ్షాలోమును ఇశ్రాయేలువారందరును ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పినదానికంటె యుక్తమని యొప్పు కొనిరి; ఏలయనగా యెహోవా అబ్షాలోముమీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థముచేయ నిశ్చయించి యుండెను.
- 1 Corinthians 1:20 1 కొరింథీయులకు 1:20జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?
- Isaiah 19:14 యెషయా 19:14యెహోవా ఐగుప్తుమీద మూర్ఖతగల ఆత్మను కుమ్మరించి యున్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసి యున్నారు
- 2 Chronicles 25:16 2 దినవృత్తాంతములు 25:16అతడు అమజ్యాతో మాటలాడుచుండగా రాజు అతని చూచినీవు రాజుయొక్క ఆలోచనకర్తలలో ఒకడవైతివా? ఊరకొనుము;నేను నిన్ను చంపనేల అని చెప్పగా ఆ ప్రవక్తనీవు ఈలాగున చేసి నా ఆలోచనను అంగీకరింపకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపజేయనుద్దేశించి యున్నాడని నాకు తెలియునని చెప్పి యూరకొనెను.
- 2 Samuel 15:31 2 సమూయేలు 15:31అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదుయెహోవా అహీతోపెలుయొక్క ఆలోచనను చెడ గొట్టుమని ప్రార్థన చేసెను.
- Romans 11:8 రోమీయులకు 11:8ఇందువిషయమైనేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.