Matthew · chapter 13 · verse 11
Matthew 13:11 in Telugu
పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింప బడలేదు.
Paraloka raajyamarmamulu eruguta meeku anugrahimpabadiyunnadi gaani vaariki anugrahimpa badaledu.
Matthew 13:11 in English
- King James Version (KJV)
- He answered and said unto them, Because it is given unto you to know the mysteries of the kingdom of heaven, but to them it is not given.
- World English Bible (WEB)
- He answered them, “To you it is given to know the mysteries of the Kingdom of Heaven, but it is not given to them.
- American Standard Version (ASV)
- And he answered and said unto them, Unto you it is given to know the mysteries of the kingdom of heaven, but to them it is not given.
- Bible in Basic English (BBE)
- And he said to them in answer, To you is given the knowledge of the secrets of the kingdom of heaven, but to them it is not given.
- Darby Translation (DBY)
- And he answering said to them, Because to you it is given to know the mysteries of the kingdom of the heavens, but to them it is not given;
- Webster's Bible (WBS)
- He answered and said to them, Because it is given to you to know the mysteries of the kingdom of heaven, but to them it is not given.
- Young's Literal Translation (YLT)
- And he answering said to them that — 'To you it hath been given to know the secrets of the reign of the heavens, and to these it hath not been given,
Read in context
- 9చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
- 10తరువాత శిష్యులు వచ్చినీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను
- 11పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింప బడలేదు.
- 12కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసి వేయబడును. మరియువారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు.
- 13ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించు చున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి
Cross references
- 1 Corinthians 2:9–10 1 కొరింథీయులకు 2:9–10ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.
- 1 Corinthians 2:14 1 కొరింథీయులకు 2:14ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
- Matthew 19:11 మత్తయి 19:11అందు కాయన అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు.
- James 1:5 యాకోబు 1:5మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.
- 1 John 2:27 1 యోహాను 2:27అయితే ఆయనవలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటినిగూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు
- 1 John 2:20 1 యోహాను 2:20అయితే మీరు పరిశుద్ధునివలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.
- Colossians 1:26–27 కొలొస్సయులకు 1:26–27మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని యేర్పాటు ప్రకారము, నేను ఆ సంఘమునకు పరిచార కుడనైతిని. అన్యజనులలో ఈ మర్మముయొక్క మహి మైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి యిప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను.
- Ephesians 5:32 ఎఫెసీయులకు 5:32ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.
- Ephesians 1:9 ఎఫెసీయులకు 1:9మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను.
- James 1:16–18 యాకోబు 1:16–18నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.
- John 6:65 యోహాను 6:65మరియు ఆయన తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను.
- Isaiah 35:8 యెషయా 35:8అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు