Job · chapter 19 · verse 6
Job 19:6 in Telugu
ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరుతెలిసికొనుడి.
Aalaagaite devudu naaku anyaayamu chesenaniyu tana valalo nannu chikkinchukonenaniyu meerutelisikonudi.
Job 19:6 in English
- King James Version (KJV)
- Know now that God hath overthrown me, and hath compassed me with his net.
- World English Bible (WEB)
- know now that God has subverted me, and has surrounded me with his net.
- American Standard Version (ASV)
- Know now that God hath subverted me [in my cause], And hath compassed me with his net.
- Bible in Basic English (BBE)
- Be certain that it is God who has done me wrong, and has taken me in his net.
- Darby Translation (DBY)
- Know now that God hath overthrown me, and hath surrounded me with his net.
- Webster's Bible (WBS)
- Know now that God hath overthrown me, and hath encompassed me with his net.
- Young's Literal Translation (YLT)
- Know now, that God turned me upside down, And His net against me hath set round,
Read in context
- 4నేను తప్పుచేసినయెడల నా తప్పు నా మీదికే వచ్చును గదా?
- 5మిమ్మను మీరు నామీద హెచ్చించుకొందురా? నా నేరము నామీద మీరు మోపుదురా?
- 6ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరుతెలిసికొనుడి.
- 7నామీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు.
- 8నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసి యున్నాడు. నా త్రోవలను చీకటి చేసియున్నాడు
Cross references
- Job 18:8–10 యోబు 18:8–10వారు వాగురల మీద నడచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మడిమెను పట్టుకొనును వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును.
- Job 27:2 యోబు 27:2నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటనుబట్టియు
- Job 7:20 యోబు 7:20నేను పాపముచేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ యెడల ఏమి చేయగలను?నాకు నేనే భారముగా నున్నాను, నీవేల గురి పెట్టితివి?
- Job 16:11–14 యోబు 16:11–14దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించియున్నాడు భక్తిహీనుల వశమున నన్ను ఉంచియున్నాడు. నేను నెమ్మదిగానుంటిని అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసియున్నాడు మెడ పట్టుకొని విదలించి నన్ను తుత్తునియలుగా చేసి యున్నాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి కనికరములేక నా తుండ్లను పొడిచెనునా పైత్యరసమును నేలను పారబోసెను. కన్నముమీద కన్నమువేసి ఆయన నన్ను విరుగగొట్టెను పరుగులెత్తి శూరునివలె నామీద పడెను.
- Hosea 7:12 హోషేయ 7:12వారు వెళ్లగా నేను వారిపైని నా వల వేయుదును, ఆకాశపక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును, వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును.
- Lamentations 1:12–13 విలాపవాక్యములు 1:12–13త్రోవను నడుచువారలారా, ఈలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండకోప దినమున నాకు కలుగజేసిన శ్రమవంటి శ్రమ మరి ఎవరికైనను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరమునుండి ఆయన నా యెముకలమీదికి అగ్ని ప్రయోగించి యున్నాడు అది యెడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కు పరచుటకై వలనొగ్గి యున్నాడు నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు ఆయన నన్ను పాడుచేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్ల జేసియున్నాడు.
- Ezekiel 12:13 యెహెజ్కేలు 12:13అతని పట్టుకొనుటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకొని కల్దీయుల దేశమైన బబులోనునకు వాని తెప్పించెదను, అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును
- Ezekiel 32:3 యెహెజ్కేలు 32:3ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీమీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు.
- Psalm 66:10–12 కీర్తనలు 66:10–12దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి. నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితివిు అయినను నీవు సమృధ్ధిగలచోటికి మమ్ము రప్పించి యున్నావు.
- Psalm 44:9–14 కీర్తనలు 44:9–14అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన పరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు. శత్రువులయెదుట నిలువకుండ మమ్మును వెనుకకు పారి పోజేయుచున్నావు మమ్మును ద్వేషించువారు ఇష్టమువచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు. భోజనపదార్థముగా ఒకడు గొఱ్ఱెలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి యున్నావు అధికమైన వెల చెప్పక ధనప్రాప్తిలేకయే నీవే నీ ప్రజలను అమ్మి యున్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పద ముగా చేసియున్నావు మా చుట్టు నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచి యున్నావు. అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు.